కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rashmika Mandanna: మరో డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌.. అంతకుమించి

ABN, First Publish Date - 2023-12-14T10:38:53+05:30

నెల రోజుల క్రితం నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌ అయన సంగతి తెలిసిందే. అయితే రెండ్రోజుల్లోనే అది తాను కాదు అని తేలింది. జారా పటేల్‌ అనే ఇనప్లూయెన్సర్‌ అని తేలింది.

నెల రోజుల క్రితం నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నకు (Rashmika mandanna) సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌ అయన సంగతి తెలిసిందే. అయితే రెండ్రోజుల్లోనే అది తాను కాదు అని తేలింది. జారా పటేల్‌ అనే ఇనప్లూయెన్సర్‌ అని తేలింది. ఈ వివాదంలో రష్మికకు సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలిచిన సంగతి తెలసిందే! ఇప్పుడు మరోసారి రష్మికకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎఐ టెక్నాలజీతో రష్మికకు ఫేస్‌ మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. ఈ వీడియో, ఫొటోలు ఇంతకుమిందు డీప్‌ ఫేక్‌ వీడియో కన్నా దారుణంగా ఉంది. గతంలో కన్నా ఇది డీప్‌గా ఉంది.

దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని ఆపాలని హెచ్చరిస్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మికకు ఇలాంటివి వరుసగా ఎదురు కావడం బాధాకరణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వీడియోలపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక రష్మిక ఇటీవల ుయానిమల్‌’ చిత్రంతో అలరించింది.  పుష్ప చిత్రంతో నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. మరోసారి శ్రీవల్లిగా సందడి చేయడానికి రెడీ అవుతుంది. అలాగే 'ది గర్ల్‌ ఫ్రెండ్‌’ అనే చిత్రం ఇటీవల ప్రారంభించారు. మరోవైపు రెయిన్‌ బో అనే సినిమా చేస్తుంది.

Updated Date - 2023-12-14T14:15:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!