సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adipurush: వైరల్ అవుతున్న ఓం! కమ్ టు మై రూమ్

ABN, First Publish Date - 2023-06-16T15:47:31+05:30

నెటిజన్స్ దర్శకుడు ఓం రౌత్ ని ట్రోల్స్ చేస్తున్నారు. అతను రావణాసురిడి పాత్ర మలచిన తీరు, ఆ సినిమా చూపెట్టే విధానం ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అందుకే వాళ్ళు ఏమంటున్నారు అంటే..

Adipurush
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్ (Prabhas) రాముడిగా, ఓం రౌత్ (OmRaut) దర్శకుడుగా 'ఆదిపురుష్' #Adipurush సినిమా ఈరోజు విడుదల అయింది. ఈ సినిమా చాలామందిని చాలా నిరాశపరిచింది. ఇదేదో ఆధునిక రామాయణం అని కొందరు అంటున్నా, ఇది ఓం రౌత్ రామాయణం అని అంటున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని అందరూ అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) చేసిన రావణుడి పాత్ర మీద నెటిజన్స్ చాలా ఫైర్ అవుతున్నారు. అసలు ఆ విఎఫ్ఎక్స్ (VFX) ఏంటి, అంత ఛండాలంగా వున్నాయి, ఆ రావణుడి పాత్రని మలచిన తీరు ఏమీ బాగోలేదు అని నెటిజన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే 'ఓం! కమ్ టు మై రూమ్' అని కూడా అంటున్నారు.

ఆ లైన్ అప్పట్లో చాలా వైరల్ అయింది. 'ఆదిపురుష్' #Adipurush సినిమా మొదటి ప్రచార చిత్రం 'అయోధ్య' లో విడుదల చేసినప్పుడు, ఆ వీడియో చూసి నెటిజన్స్ బాగా విమర్శించారు. వాళ్ళే కాదు, ఆ వీడియో చూసిన అందరూ అది బాగోలేదు, అందులో విఎఫ్ఎక్స్ బాగోలేవు, అలాగే రావణుడి పాత్ర కూడా బాగోలేదు అన్నారు. ఆ ఈవెంట్ అయ్యాక ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ తో, 'ఓం! కమ్ టు మై రూమ్' అని అన్నాడు. అప్పుడు అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే మాట వైరల్ అవుతుంది. సినిమా చూసి బయటకి వచ్చిన వాళ్ళు అందరూ సినిమా బాగోలేదని, అందుకని 'ఓం! కమ్ టు మై రూమ్' అని అంటున్నారు.

Updated Date - 2023-06-16T15:47:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!