కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Radha Madhavam: ‘రాధా మాధవం’ నుంచి ‘నువ్వు నేను’ పాట విడుదల

ABN, Publish Date - Dec 25 , 2023 | 06:54 PM

గ్రామీణ ప్రేమ కథలో ఓ సహజత్వం ఉంటుంది. విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథతో, సహజత్వం ఉట్టి పడేలా రూపొందిన‌ అందమైన ప్రేమ కథా చిత్రం రాధా మాధవం.

radha madhavam

గ్రామీణ ప్రేమ కథలో ఓ సహజత్వం ఉంటుంది. విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రమే రాబోతోంది. అలాంటి సహజత్వం ఉట్టి పడేలా వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’ (Radha Madhavam). ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా (Vasanth Venkat Bala) కథ, మాటలు, పాటలను అందించారు.

ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.


అంతే కాకుండా బిగ్ బాస్ సోహెల్ రీసెంట్‌గా 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే ఈ పాటను విడుదల చేయగా శ్రోతలను ఆకట్టుకుంది. తాజాగా ‘నువ్వు నేను’ (Nuvvu Nenu)అంటూ సాగే మరో పాటను చిత్ర యూనిట్ పాటను విడుదల చేసింది. వసంత్ వెంకట్ బాలా రాయగా.. సమీరా భరద్వాజ్, రవి.జీ ఆలపించగా కొల్లి చైతన్య (Kolli Chaitu) బాణీలు వినసొంపుగా ఉన్నాయి. జనవరి నెలలో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 07:23 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!