NTR30: ఎన్టీఆర్30 ఓపెనింగ్ ఫోటోస్ వైరల్
ABN, First Publish Date - 2023-03-23T15:53:41+05:30
ఈరోజు ఎక్కడ చూసిన ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభోత్సవ దృశ్యాల్లో. ఉదయం ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. చలన చిత్ర పరిశ్రమలోని చాలామంది దీనికి హాజరయ్యారు. ఈ పిక్చర్స్ చాలా వైరల్ అయ్యాయి.
ప్రేక్షకులు ఎప్పటినుంచో, ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్30 (NTR30) సినిమా ఎట్టకేలకు అధికారికంగా ప్రారంభం అయింది. కొరటాల శివ (Koratala Siva) ఈ సినిమా తన కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన సినిమాలు అన్నిటికన్నా ఇది బెస్ట్ అవుతుంది అని చెపుతున్నాడు. అలాగే ఇప్పుడున్న తరంలో ఎన్టీఆర్ (NTR) ని బెస్ట్ నటుడుగా అభివర్ణించాడు.
సినిమా కథా నేపథ్యం కూడా వేకెంట్ కోస్టల్ ల్యాండ్స్ అని చెప్పాడు. అక్కడి మనుషులు దేనికీ భయపడరు కానీ ఒక్క వ్యక్తికి భయపడతారు అని చెప్పాడు కొరటాల కథ గురించి.
భారతదేశంలో ఇద్దరు అగ్ర దర్శకులు, ఒకరు 'కెజిఫ్' (KGF) సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ఇంకొకరు 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాతో ఆస్కార్ అవార్డు (Oscars95) అందుకొన్న రాజమౌళి (Rajamouli), ఇద్దరూ లాంఛనంగా ఈ సినిమాని ప్రారంభించటం విశేషం.
ప్రముఖ నిర్మాత, ఎన్టీఆర్ తో అతని చిన్నప్పుడు 'బాల రామాయణం' (Bala Ramayanam) తీసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి (Shyam Prasad Reddy) స్క్రిప్ట్ ని దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ లకు అందచేశారు.
జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) ఈ సినిమాలో కథానాయిక, ముంబై నుండి వచ్చింది, చీరలో చాలా అందంగా వుంది. ఎక్కువ సేపు రాజమౌళి తో మాట్లాడుతూ కనిపించింది. ఎన్టీఆర్ వచ్చాక, జాన్వీ కపూర్ ని చూసి పలకరించాడు. ఆ తరువాత జాన్వీ దర్శకుడు కొరటాల శివతో సినిమా గురించి మాట్లాడుతూ కనిపించింది.
నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రీకాంత్ (Srikanth) లు ఈ సినిమా లో ప్రధాన పాత్రల్లో కనపడనున్నారేమో, అందుకని ఇద్దరూ ప్రారంభోత్సవానికి వచ్చారు. ప్రకాష్ రాజ్ అందరితో మాట్లాడుతూ తిరుగుతూ కనిపించాడు. ఎక్కువ సేపు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కనపడ్డాడు.
అలాగే ఎన్టీఆర్, రాజమౌళి లు ఎక్కువ సేపు మాట్లాడుతూ కనిపించారు. 'ఆర్.ఆర్.ఆర్' ప్రచారం కోసం అమెరికా వెళ్లి అక్కడ ఇద్దరూ కలిపి చాలా ప్రచారాల్లో కలిసి పాల్గొన్నారు, మళ్ళీ ఇక్కడ కలిసి ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవటం కనిపించింది.
ఈ చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), కొసరాజు లు ఇద్దరూ ముందు వచ్చి పూజా కార్యక్రమాలు చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో నందమూరి హరికృష్ణ, అలాగే లేట్ ఎన్టీఆర్ ఫోటోస్ చూపించారు.
సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వచ్చాడు. అతను భారతీయ డ్రెస్ లో వచ్చి అందరికి శుభాకాంక్షలు తెలియ చేశారు.