సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Jr Ntr: తారక్ ఇంట్లో పార్టీ దేనికి.. ఆ సినిమా ఖాయమేనా

ABN, First Publish Date - 2023-04-13T10:34:44+05:30

యంగ్‌ టైగర్‌ (ntr) ఎన్టీఆర్‌ ఇంట్లో బుధవారం రాత్రి పార్టీ జరిగింది. అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫెర్రెల్‌ (James Farrell) ఈ కార్యక్రమంలో భాగం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్‌ టైగర్‌ (ntr) ఎన్టీఆర్‌ ఇంట్లో బుధవారం రాత్రి పార్టీ జరిగింది. అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫెర్రెల్‌ (James Farrell) ఈ కార్యక్రమంలో భాగం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. (Amazon Vice president) అలాగే పరిశ్రమకు సంబంధించిన అగ్ర దర్శకులు రాజమౌళి9Rajamouli), త్రివిక్రమ్‌(Trivikram), కొరటాల శివ(Siva koratala), నిర్మాతలు శోభు యార్లగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, ‘దిల్‌’ రాజు సోదరుడు శిరీష్‌ తదితరులు హాజరయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంతో ఎన్టీఆర్‌కు సినిమాకు విదేశాల్లో ఫ్యాన్‌ బేస్‌ పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆయన పోషించిన కొమురం భీమ్‌ పాత్రలో ఆయన అభినయానికి ఎంతోమంది అభిమానులు అయ్యారు. తాజా అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫెర్రెల్‌ తారక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిసింది. ఆయన్ను కలవడం కోసమే అమెరికా నుంచి ఆయన వచ్చారని టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తారక్‌ చిత్ర పరిశ్రమలో కొందరు అగ్ర దర్శకనిర్మాతలను పిలిచి పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను తారక్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘నా స్నేహితులు, కావలసిన వారితో సరదాగా సాయంత్రం గడిచింది. పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్‌ జేమ్స్‌’’ అని పోస్ట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వినీదత్‌ కుమార్తె, నిర్మాత స్వప్నాదత్‌, సూర్యదేవర నాగవంశీ సైతం పార్టీలో కాేసపు సందడి చేశారని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల నుంచి సమాచారం. నిర్మాత ‘దిల్‌’ రాజు ఢిల్లీలో ఉండటం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ‘పుష్ప 2’ షూటింగ్‌ కోసం విశాఖ లో ఉన్న సుకుమార్‌ కూడా ఈ వేడుకలో భాగం కాలేదు.

అయితే తారక్‌ను జేమ్స్‌ ఫెర్రెల్‌ కలవడం అన్నది ఇప్పుడు (Tarak Party to James Farrell) చర్చనీయాశమైంది. ప్రస్తుతం తారక్‌ నటిస్తున్న ఎన్టీఆర్‌ 30 ఓటీటీ స్ర్టీమింగ్‌ అమెజాన్‌ తీసుకుందా? అన్న చర్చ మొదలైంది. అంతే కాదు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్‌లో కూడా నటించాలనుందనే కోరికను భయటపెట్టారు తారక్‌. అందులో భాగంగానే జేమ్స్‌ తారక్‌ను కలిశాడా? అమెజాన్‌ ఇంటర్నేషనల్‌ స్టూడియోస్‌ తారక్‌తో సినిమా ప్లాన్‌ చేయనుందా? అన్న చర్చ మొదలైంది. తారక్‌ సన్నిహితుల మాత్రం పార్టీకి ఈ సినిమాకు ఏ సంబంధం లేదని చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. త్వరలో గోవా షెడ్యూల్‌ ప్రారంభించడానికి యూనిట్‌ సిద్ధమవుతోంది. ఈ నెల 19న ఎన్టీఆర్‌ గోవా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2023-04-13T10:38:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!