Ntr birthday Plans: అభిమానుల టార్గెట్ అదే!
ABN, First Publish Date - 2023-05-02T11:51:36+05:30
70 వేల రీట్వీట్లు, 10 వేల కొటోస్, 1 లక్ష కామెంట్లు 3 లక్షల లైక్‌లు.. ఇదే అభిమానుల టార్గెట్
ఎన్టీఆర్ 30 (Ntr 30) చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇటీవల ప్రారంభమైన పోరాట సన్నివేశాలు పూర్తి కావొచ్చాయి. తదుపరి షెడ్యూల్‌కు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. అయితే రాబోతున్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందడిని అభిమానులు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. ఈ నెల 20న తారక్ (Tarak Birthday celebration plans) పుట్టిన రోజున వచ్చే అప్డేట్ల కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ అప్డేట్లతో సోషల్ మీడియా మార్మోగిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి కొన్ని టార్గెట్లు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారని తెలిసింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ మేరకు ట్విట్టర్లో ఫ్యాన్స్ పేజ్‌లు క్యాంపెయిన్ ప్రారంభించాయి. ఎనీఆర్30, (ntr Fans mania) తదుపరి చిత్రాల అనౌన్స్మెంట్ ఏది వచ్చినా టార్గెట్ నంబర్‌తో ట్రెండ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. (Ntr30)
70 వేల రీట్వీట్లు,
10 వేల కొటోస్,
1 లక్ష కామెంట్లు
3 లక్షల లైక్‌లు
ఇదే అభిమానుల టార్గెట్. దీని కంటే సంఖ్య పెరగాలే కానీ తగ్గకూడదు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘ఇదే మన టార్గెట్. అందరూ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్ర్పెడ్ చేయండి. అభిమానులు అందరినీ ట్విట్టర్లోకి లాగండి. ఎన్టీవోడి సంభవం, సంబరం అంటే ఏంటో చూస్తారు’’ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అభిమానులు ట్వీట్లతో చేస్తున్న ఈ సందడి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. జాన్వీకపూర్ ఈ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమవుతున్నారు. కొరటాల - తారక్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.