NTR: ఆ మూడు చిత్రాలకీ అవార్డులు.. అందుకే రాష్ట్రపతి నుంచి ప్రత్యేకంగా..
ABN, First Publish Date - 2023-03-05T13:51:51+05:30
లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ (29-03-1963) చిత్రంలోనిది ఈ స్టిల్. ఉత్తర రామాయణాన్ని సినిమాగా తీయాలన్న నిర్మాత శంకరరెడ్డి (Shankar Reddy) ఆలోచనే అపూర్వమైంది.
లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ (29-03-1963) చిత్రంలోనిది ఈ స్టిల్. ఉత్తర రామాయణాన్ని సినిమాగా తీయాలన్న నిర్మాత శంకరరెడ్డి (Shankar Reddy) ఆలోచనే అపూర్వమైంది. ఆ ఆలోచనకు అగ్రశేణి కళాకారులు బంగారు పళ్లానికి గోడదాపులా నిలిచారు. ప్రతి పాత్రకు శిఖర సమానులైన నటులే లభించారు. ముఖ్యంగా శ్రీరాముడిగా ఎన్.టి.రామారావు (NT Ramarao) తప్ప తెలుగు సినిమా చరిత్రలో అప్పటికీ, ఇప్పటికీ మరొకరు లేరన్న సత్యాన్ని ఈ చిత్రం నిరూపించింది. తెలుగులో మొదటి వర్ణచిత్రమిది.
మూడు గంటల యాభై నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో సుమారు 36 పాటలు, పద్యాలు ఉన్నాయి. అయినా సినిమా ఎక్కడా విసుగనిపించదు. దర్శకులు, సంగీత దర్శకుడు ప్రేక్షకుల నాడి తెలిసినవారు గనుక పాటలన్నీ రక్తికట్టాయి. ఆ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి బహుమతితో పాటుగా ఒకే సంవత్సరం ‘లవకుశ’ (Lavakusha), ‘నర్తనశాల’ (NarthanaShala), ‘కర్ణన్’ (Karnan) (తమిళం) - ఈ మూడు అవార్డుల చిత్రాలలో నటించినందుకుగాను ఎన్.టి.ఆర్. రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నారు. ఆ రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా రంగానికి తరగని సంపదగా నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి:
Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు
Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్