సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR- RRR- Oscar 2023: కష్టమైనా... లెక్కలేనన్ని సార్లు.. కానీ ఆ తర్వాతే అర్థమైంది!

ABN, First Publish Date - 2023-03-12T14:39:32+05:30

ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscar 2023)వేడుకకు సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో 95వ ఆస్కార్‌ విజేతల వివరాలు బయటకు రానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscar 2023)వేడుకకు సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో 95వ ఆస్కార్‌ విజేతల వివరాలు బయటకు రానున్నాయి. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ (Dolby THeatre) ఈ వేడుకకు వేదిక కానుంది. యావత్‌ ప్రపంచం ఎంతోగానో ఎదురుచూస్తున్న తరుణమిది. అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటాలని కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ (natu natu) పాటను బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. దీని ప్రమోషన్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అమెరికాలో సందడి చేస్తున్నారు. తారక్‌, రామ్‌చరణ్‌ పలు ఇండర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ ఓ హాలీవుడ్‌ ఛానల్‌తో మాట్లాడారు. ‘నాటు నాటు’ పాట రిహార్సెల్‌, చిత్రీకరణ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘‘నాటు నాటు’పాట ఇంత బాగా రావడానికి ప్రేమ్‌రక్షిత్‌ మాస్టర్‌, ఆయన బృందం కారణం. మేము చేసిన డ్యాన్స్‌ కంటే ఒకే సింక్‌లో చేయడం చాలా కష్టంగా అనిపించింది. నేను, చరణ్‌ దీనికోసం రోజుకు 3 గంటలు ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. అలాగే షూటింగ్‌ సమయంలో, షూటింగ్‌కు ముందు లెక్కలేనన్ని సార్లు రిహార్సల్స్‌ చేశాం. ఆ పాట షూటింగ్‌ సమయంలో రాజమౌళి మా ఇద్దరి మూమెంట్‌ ఒకేలా ఉండాలని ఎన్నో టేక్‌లు తీసుకున్నారు. ఇప్పటికీ నా కాళ్ల నొప్పులు తగ్గలేదు. ప్రతి స్టెప్‌ను ప్రేక్షకులు ఇంతగా పట్టించుకుంటారా? ఇంతలా ప్రేక్షకులు గమనిస్తారా? అని అనుకున్నాను. కానీ పాట విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ మా ఇద్దరి డ్యాన్స్‌ సింక్‌ గురించే అందరూ మాట్లాడుకున్నారు. అప్పుడు అర్థమైంది ప్రేక్షకులు ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనిస్తారని. ప్రేక్షకులకు ఏం కావాలో తెలిసిన దర్శకుడు కాబట్టే తెరపై ప్రతి సన్నివేశం పండాలనుకుంటారు. పర్‌ఫెక్షన్‌ కోరుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పూర్తిగా స్నేహబంధంతో ముడిపడిన సినిమా. (Tarak about Natu natu Reharsels)

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) పూర్తిగా స్నేహానికి సంబంధించినది . సినిమా రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ మా చిత్రం భాగం కావడం మాకెంతో గర్వంగా ఉంది. ఇంతకు మించి నటుడిగా ఇంకేం చెప్పగలను. ఈ వేడుక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఓ నటుడిగా కాకుండా భారతీయుడిగాఆ వేడుకకు హాజరవుతాను. నా వస్త్రధారణలో భారతీయత కనిపించేలా ప్రయత్నిస్తాను’’ అని తారక్‌ అన్నారు.

Updated Date - 2023-03-12T14:39:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!