కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Extra-Ordinary Man: నితిన్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే!

ABN, First Publish Date - 2023-10-09T14:30:00+05:30

నితిన్, శ్రీలీల జంటగా, రైటర్ దర్శకుడు వక్కంతం వంశి దర్శకత్వంలో వస్తున్న 'ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమా ఇప్పుడు కొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Actor Nithiin

నితిన్ (NIthiin), శ్రీలీల (Sreeleela) జంటగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ (Extra-OrdinaryMan) సినిమా విడుదలకి సిద్ధం అయింది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే, డిసెంబర్ 22న విడుదల కావాల్సి వుంది ఈ సినిమా. కానీ అదే తేదీకి ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'సలార్' #Salaar సినిమా వస్తుండటంతో ఇప్పుడు నితిన్ తన విడుదల తేదీని మార్చుకున్నాడు. కొత్త తేదీని డిసెంబర్ 8 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు. దీనికి రైట‌ర్, దర్శకుడు వ‌క్కంతం వంశీ (VakkanthamVamsi). సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు డిసెంబర్ 8న 'ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమాను భారీ ఎత్తున్న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్వాహకులు ప్రకటించారు.

మ్యూజికల్ జీనియస్ హారిస్ జైరాజ్ (HarrisJayaraj) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదివరకే విడులైన ‘డేంజర్ పిల్లా..’ సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది అని చిత్ర నిర్వాహకులు తెలిపారు. అలాగే నితిన్ లుక్స్‌కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారు అని అంటున్నారు. క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో, 'కిక్' సినిమా త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది ఈ సినిమా. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు.

Updated Date - 2023-10-09T14:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!