కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nithiin: నితిన్‌ హీరోగా దిల్‌ రాజు సినిమా!

ABN, First Publish Date - 2023-08-27T12:30:57+05:30

నితిన్‌(nithiin) కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ మరో క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీరామ్‌ వేణు (Sriram Venu)దర్శకత్వంలో ‘తమ్ముడు’ (Thammudu) సినిమా గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది.

నితిన్‌(nithiin) కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ మరో క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీరామ్‌ వేణు (Sriram Venu)దర్శకత్వంలో ‘తమ్ముడు’ (Thammudu) సినిమా గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్‌ ప్రసాద్‌ క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు వంశీ పైచి?పల్లి ఫస్ట్‌షాట్‌ డైరెక్షన్‌ చేశారు. దిల్‌ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రానికి ‘‘దంగల్‌, కహానీ, తారే జమీన్‌ పర్‌ లాంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్‌ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు వెల్లడించున్నారు.

దిల్‌ రాజు నిర్మాణ సంస్థతో హీరో నితిన్‌, దర్శకుడు శ్రీరామ్‌ వేణుకు మంచి అనుబంధం ఉంది. నితిన్‌ దిల్‌, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలు చేశారు. శ్రీరామ్‌ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వకీల్‌సాబ్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ‘తమ్ముడు’ సినిమా ప్రారంభం కావడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

"కొన్ని టైటిల్స్ మనలో ఉత్సాహాన్ని నింపడంతోపాటు బాధ్యతను పెంచుతాయి. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అంచనాలను పెంచేలా ఏ చిత్రం ఉంటుంది" అని నితిన్ తెలిపారు 

Updated Date - 2023-08-27T13:04:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!