సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Spy: ఆదిపురుష్ ప్రభావం నిఖిల్ సినిమా మీద ఉంటుందా...

ABN, First Publish Date - 2023-06-19T13:12:39+05:30

రాముడిని, రామాయణాన్ని వాడుకొని దర్శకుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' సినిమా తీసి ప్రజల బలహీనత మీద డబ్బులు చేసుకున్నారు అనే విమర్శలు పెల్లుబికాయి. ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ 'స్పై' సినిమా కూడా సుభాష్ చంద్రబోస్, ఇంకా మరికొందరు జాతీయ స్వాతంత్ర సమరయోధుల పేర్లు ప్రచారానికి వాడేసుకుంటున్నారు అనే విమర్శలు మొదలయ్యాయి.

Still from the film Spy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని రోజుల క్రితం నటుడు నిఖిల్ సిద్ధార్థ (NikhilSidhdartha) తన సినిమా 'స్పై' #Spy నిర్మాతల మీద అలిగాడు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు నిజమే అన్నట్టుగా ఆ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాటని నిఖిల్ తన సాంఘిక మాధ్యమాల్లో పెట్టకపోవడం, దాని గురించి మాట్లాడకపోవడం. నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి (RajasekharReddy) మధ్య ఆ సినిమా విడుదల విషయంలో చిన్న వివాదం వచ్చిందన్న వార్తా కూడా బాగా వైరల్ అయింది. సినిమా విడుదల ఒక వారం పాటు నిఖిల్ వాయిదా వేయమన్నట్టుగా అన్నాడని, నిర్మాత ససేమిరా ఒప్పుకోకుండా అదే తేదీ జూన్ 29 నే విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనితో నిఖిల్ అలిగాడు అని వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ నేపథ్యంలో నిర్మాత నిఖిల్ డబ్బింగ్ చెప్పకపోతే వేరే వాళ్ళతో చెప్పించి విడుదల చేయించడానికి కూడా రెడీ అయ్యారు అని కూడా వార్తలు వచ్చాయి. నిర్మాత నిర్ణయానికి చకితుడయిన నిఖిల్ దిగి వచ్చి, సినిమాకి ప్రచారం చేస్తానని ఒప్పుకున్నాడు అని తెలిసింది. అదీ కాకుండా నిర్మాతకి, నిఖిల్ కి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టుగా కూడా ఉండొచ్చు, అందుకే నిఖిల్ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు అని కూడా చర్చ నడుస్తోంది. ట్విట్టర్లో ఈ సినిమా విడుదల తేదీ జూన్ 29 అని మరో సారి నిఖిల్ కన్ఫర్మ్ చేసాడు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా మీద 'ఆదిపురుష్' #Adipurush ప్రభావం ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (KritiSanon) సీతగా, ఓం రౌత్ (OmRaut)దర్శకత్వంలో రామాయణం ప్రాతిపదికగా తీసాం అని వచ్చిన ఈ సినిమా రామాయణాన్ని అపహాస్యం చేయడానికా అన్నట్టుగా, తప్పుల తడకగా తీసి అందరి విమర్శలకు తావయింది. శ్రీరామ నామాన్ని, ప్రజల బలహీనతని బాగా వాడుకున్నారు అని కూడా విమర్శిస్తున్నారు అందరూ.

మరి ఇప్పుడు నిఖిల్ నటించిన 'స్పై' #Spy సినిమా కూడా అలాంటిదే అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ (SubhashChandrabose) హిడెన్ స్టొరీ, సీక్రెట్స్ ఆధారంగా గ్యారీ బిహెచ్ (Gary BH) దర్శకత్వంలో వస్తోంది అని చెపుతున్నారు. ఇక్కడ సుభాష్ చంద్రబోస్, అలాగే ఇంకా మరికొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు కూడా ఈ సినిమాలో వాడుకుంటున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కథ జాతీయ సబ్జెక్టు అని, సుభాష్ చంద్రబోస్ చుట్టూ, అతని మరణం నిజమా అబద్దమా ఇలాంటి కథ కూడా ఇందులో ఉందని అంటున్నారు.

నిఖిల్.. “క్వాలిటీ లాక్... టార్గెట్ లాక్... స్పై లాక్ 👉🏻 జూన్ 29న వరల్డ్‌వైడ్ థియేటర్లలో #IndiasBestKeptSecret #Netaji #SubhasChandraBose” అని ట్వీట్ చేశారు. ఫోటో కూడా మెషిన్ గన్ పట్టుకుని, సుభాష్ చంద్రబోస్‌తో సహా స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల పక్కన నిలబడిన పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. అంటే ఈ సినిమాకి కూడా 'ఆదిపురుష్' #Adipurush లా ఇలా అందరినీ వాడేసుకుంటున్నారా అని సాంఘీక మాధ్యమంలో అప్పుడే మొదలయింది. అందుకని ఈ సినిమా మీద 'ఆదిపురుష్' సినిమా ప్రభావం కొంచెమైనా ఉంటుంది అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

Updated Date - 2023-06-19T13:12:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!