Niharika Konidela: సమాధానం చెప్పకనే చెప్పేసిందా....
ABN, First Publish Date - 2023-03-27T19:08:08+05:30
నిహారిక కొణిదెల కూడా తన సాంఘీక మాధ్యమం నుండి చైతన్య ఫోటోస్ అన్నీ డిలీట్ చేసేసింది. దీని భావమేమి తిరుమలేశ అన్నట్టుగా, దీనితో ఆమె అందరికీ అసలు విషయం చెప్పేసినట్టేనా...
ఈమధ్య నిహారిక కొణిదెల (Niharika Konidela) వార్తల్లో వుంది. అటు సాంఘీక మాధ్యమాల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో ఆమె వివాహం గురించి వార్తలు బాగా వైరల్ అయ్యాయి (Niharika marriage). ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) ఈమధ్య అతని సాంఘీక మాధ్యమం నుండి నిహారిక వున్న ఫోటోస్ అన్నీ తీసేయటం తో ఈ దుమారం బయలుదేరింది. అయితే దీని మీద అటు చైతన్య కుటుంబం కానీ, ఇటు కొణిదెల (Konidela family) కుటుంబం కానీ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. కనీసం ఆ వార్తలను ఖండించనూ లేదు, ఆలా అని బలపరచలేదు. అలాగే ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవటంతో కూడా ఈ విషయం బయటపడింది.
అందువల్ల ఈ వార్త మరికొంచెం ఎక్కువ ప్రాధాన్యత చోటుచేసుకుంది. అయితే నిహారిక ఎప్పుడూ తన సాంఘీక మాధ్యమం అయిన ఇంస్టాగ్రామ్ (Instagram) లో ఈరోజు కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసింది. అలాగే ఆమె పాత ఫోటోస్ కనక ఒక్కసారి చూస్తే ఇంస్టాగ్రామ్ నుండి ఆమె కూడా చైతన్య జొన్నలగడ్డ వున్న ఫోటోస్ అన్నీ తీసేసింది. ఒకటి ఫోటో మాత్రం, 'ఒక చిన్న ఫామిలీ' (Oka Chinna Family) వెబ్ సిరీస్ ప్రచార గ్రూప్ ఫోటోలో అతను వున్నది ఉంచింది. అలాగే ఆమె వివాహం అప్పుడు వున్న ఫోటోస్ లో కూడా చైతన్య వున్న ఫోటోస్ అన్నీ డిలీట్ చేసేసింది.
తను సింగల్ గా వున్న పెళ్లి ఫోటోస్ మాత్రం ఉంచింది. మిగతావన్నీ తీసేసింది. దాని మీద కూడా నెటిజన్స్ ఆమెని ఏవేవో ప్రశ్నలు వేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఇంస్టాగ్రామ్ లో హాఫ్ సారీ ఫోటోస్ పోస్ట్ చేసింది. వాటికి కేప్షన్ ఏమీ రాయలేదు, ఒక దానికి మాత్రం పాత లుక్ అన్నట్టుగా పెట్టింది.
ఇప్పుడు పోస్ట్ చేసిన ఈ లుక్ ఏదైనా సినిమా కోసమా, లేదా వెబ్ సిరీస్ కోసమా అన్నది ఇంకా తెలియలేదు. ఆమెకి ఇంస్టాగ్రామ్ లో సుమారు 2.1 మిలియన్ ఫాలోవర్స్ వున్నారు.