BandlaGanesh: బండ్ల ట్వీట్, ఆడుకుంటున్న నెటిజన్లు
ABN, First Publish Date - 2023-02-20T16:19:10+05:30
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈమధ్య వూరికే ఉండటం లేదు, ఎప్పుడూ ఎదో ఒక వార్తల్లో ఉంటూ ఉంటాడు. టీవీ లోకి వచ్చి మాట్లాడటమో, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే చేస్తూ ఉంటాడు. అవేమీ లేకుండా ఉంటే, తన సాంఘీక మాధ్యమాల్లో ఎదో ఒక వివాదాస్పద మాటలు రాయడం లాంటివి చేసి వార్తల్లో ఉంటూ ఉంటాడు.
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈమధ్య వూరికే ఉండటం లేదు, ఎప్పుడూ ఎదో ఒక వార్తల్లో ఉంటూ ఉంటాడు. టీవీ లోకి వచ్చి మాట్లాడటమో, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే చేస్తూ ఉంటాడు. అవేమీ లేకుండా ఉంటే, తన సాంఘీక మాధ్యమాల్లో ఎదో ఒక వివాదాస్పద మాటలు రాయడం లాంటివి చేసి వార్తల్లో ఉంటూ ఉంటాడు. ఇప్పుడు అలానే ట్వీట్ చేసాడు. ఇంతకు అతను చేసిన ట్వీట్ దేనిమీద ఆంటీ, నందమూరి తారకరత్న (#NandamuriTarakaratna) చనిపోయిన తరువాత అతని పార్థివ దేహాన్ని, హైదరాబాద్ లో వున్న అతని ఇంటికి తీసుకు వచ్చారు. తారకరత్న (#Tarakaratna) ఇటు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu)కి, అటు వై.ఎస్.ఆర్.సి.పి నాయకుడు, ఎంపీ అయిన విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కి కూడా బంధువు కావటంతో ఇద్దరూ తారకరత్న ఇంటికి వెళ్లారు.
విజయసాయి రెడ్డి మరదలి కూతురు అలేఖ్య రెడ్డి (Alekhya Reddy), తారకరత్న భార్య. చంద్రబాబు కి తారకరత్న దగ్గర బంధువు, అదీ కాకుండా తెలుగు దేశం పార్టీ నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్నాడు కూడా. ఇలా ఈ ఇద్దరికీ బంధువు కావటంతో, ఆ ఇద్దరూ వచ్చారు, వచ్చాక పలకరించుకుంటారు కదా, అదే చేశారు వాళ్ళు. అది మన బండ్లన్న కి నచ్చలేదు.
అందుకని వాళ్లిద్దరూ కలిసి వున్నా ఫోటో పెట్టి ఇంకా ఏదో సింహాలు అంటూ ఒక ట్వీట్ చేసాడు. "నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! (sic)", అని ట్వీట్ చేసాడు బండ్లన్న. (#BandlaGanesh)