సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sitara Ghattamaneni: ఎవరైనా నిన్ను ఫాలో అయితే పరిస్థితి ఏంటి?.. మహేశ్‌ కుమారైపై నెటిజన్ల విమర్శలు

ABN, First Publish Date - 2023-04-09T14:55:50+05:30

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) పిల్లలు గౌతమ్, సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Mahesh babu and Sithara
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) పిల్లలు గౌతమ్, సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మహేశ్ గారాల పట్టి సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) నెట్టింట యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన విషయాలను ఘట్టమనేని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తను సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టిన కొద్ది సమయంలోనే అది వైరల్ అవుతూ ఉంటుంది. సితార పిక్స్‌పై ఘట్టమనేని అభిమానులు చాలా ప్రేమగా కామెంట్లు పెడుతుంటారు. అయితే.. సితార తాజాగా పిక్ నెటిజన్ల కోపానికి కారణమైంది. (Trolling on Sitara Ghattamaneni)

Also Read: Preity Zinta: అతనే నన్ను వేధించాడు.. ఇలా జరిగితే మిస్ కాల్ ఇవ్వమంటూ..

సితార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ని షేర్ చేసింది. అందులో.. సితార కారులో వెళుతూ తలని బయటకి పెట్టి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. కారులో వెళుతున్న సితార అలా తల బయటకి పెట్టడం చాలామందికి నచ్చలేదు. దీంతో సితారకి జాగ్రత్తలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

‘తప్పమ్మా అలా చేయకూడదు. సీటు బెల్ట్ పెట్టుకుని బుద్దిగా లోపల కూర్చో’ అని కొందరు.. ‘నువ్విలా చేయడం చూసి చాలా మంది అలానే చేస్తారు. రోడ్డు మీద ట్రాఫిక్‌లో ఎవరైనా పిల్లలు ఇలా చేస్తే.. జరగరానిది ఏదైనా జరగొచ్చు. అప్పుడు వాళ్ల కుటుంబాలు ఎంత బాధపడతాయి?. నువ్వు పెట్టే ఏ పిక్‌ అయినా అందరికి ఉపయోగపడేలా ఉండాలి’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే సితార ఫొటోలో చాలా అందంగా ఉందని, కారు ఆగి ఉన్నప్పుడే సితార ఫొటో దిగి ఉంటుందని తనకి సపోర్టుగా రాసుకొస్తున్నారు. కాగా.. సితారకి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం విశేషం. అలాగే.. యూట్యూబ్‌లోనూ సితారకి ‘ఆద్య & సితార’ అనే ఛానెల్ ఉంది. ఆ యూట్యూబ్ ‌ఛానెల్‌కి దాదాపు 3 లక్షల వరకు సబ్‌స్రైబర్స్ ఉండడం విశేషం.

ఇవి కూడా చదవండి:

Adipurush: మరో వివాదంలో ప్రభాస్ మూవీ.. తన ఆర్ట్ వర్క్‌ని దొంగిలించారంటూ..

Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-09T15:18:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!