Akhil Akkineni: భారత జట్టులో కె.ఎల్.రాహుల్ ప్లేస్ లో అఖిల్...
ABN, First Publish Date - 2023-02-27T13:09:33+05:30
తెలుగు వారియర్స్ (#TeluguWarriors) కి అఖిల్ అక్కినేని (#AkhilAkkineni) కెప్టెన్ కాగా, ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో అఖిల్ 213 పరుగులు చేసాడు. ఇండియన్ టీంలో కె.ఎల్. రాహుల్ ఎలాగు బాగా ఆడటం లేదు, అఖిల్ ని అక్కడికి పంపండి అని నెటిజన్స్ సాంఘీక మాధ్యమాల్లో సజెస్ట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్ గా వస్తున్నా కె.ఎల్. రాహుల్ (#KLRahul) ఈమధ్య విఫలం అవుతూ వస్తున్నాడు. గత పది ఇన్నింగ్స్ లో కనీసం 25 పరుగులు కూడా దాటకుండానే అవుట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా (#AustraliavsIndiaCricket) తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా ఘోరంగా విఫలం అయ్యాడు. కె.ఎల్. రాహుల్ ని పక్కన పెట్టాలని భారత క్రికెట్ మేనేజ్ మెంట్ మీద బాగా ఒత్తిడి వచ్చింది. మార్చ్ 1 నుండి జరగబోయే మూడో టెస్టులో (#IndiavsAustraliaThirdTest) కె.ఎల్. రాహుల్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నారు. ఈమధ్యనే కె.ఎల్. రాహుల్ వివాహం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (#SunielShetty) కూతురు అతియా శెట్టి (#AthiyaShetty) తో జరిగింది.
ఇదిలా ఉంటే, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (#CCL) అని సినిమా తారలు అందరూ ఆడుతూ వుంటారు, అది ఈమధ్యనే మొదలయింది. తెలుగు వారియర్స్ (#TeluguWarriors) కి అఖిల్ అక్కినేని (#AkhilAkkineni) కెప్టెన్ కాగా, ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో అఖిల్ 213 పరుగులు చేసాడు. అలాగే మాన్ అఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు.
మూడు మ్యాచ్ లలోనూ మూడు సార్లు 50కి (#CelebrityCricketLeague) పైగా పరుగులు చేసాడు. ఇంకా సాంఘీక మాధ్యమాల్లో అఖిల్ క్రికెట్ ఆట గురించి ఒకటే పొగుడుతున్నారు. ఇండియన్ టీంలో కె.ఎల్. రాహుల్ ఎలాగు బాగా ఆడటం లేదు, అఖిల్ ని అక్కడికి పంపండి అని నెటిజన్స్ సాంఘీక మాధ్యమాల్లో సజెస్ట్ చేస్తున్నారు. అయ్యగారు సినిమాల్లో కన్నా క్రికెట్ లో బాగా రాణిస్తున్నాడు, అందుకని ఇండియన్ టీం కి పంపండి అని.
అలాగే అఖిల్ అక్కినేని ఇండియన్ టీం కి ఆడితే, కె.ఎల్. రాహుల్ సినిమాలు చేయొచ్చు అని కూడా అంటున్నారు, అతనికి అది తేలిక కూడా, ఎందుకంటే కె.ఎల్. రాహుల్, సునీల్ శెట్టి అల్లుడు కదా, ఈజీ గానే ఛాన్స్ వస్తుంది అని నెటిజన్స్ అంటున్నారు. ఇలా కె.ఎల్. రాహుల్ మీద ట్రోలింగ్ చేస్తూ, అఖిల్ ని బాగా పొగుడుతున్నారు. అఖిల్ కి సినిమాలకన్నా క్రికెట్ ఆడటమే బెస్ట్ అని కూడా కొందరు నెటిజన్స్ అంటున్నారు. అఖిల్ కూడా ఆస్ట్రేలియా లో చదువుకున్నాడు కదా, అక్కడ స్పోర్ట్ ఒక సబ్జెక్టు, అఖిల్ క్రికెట్ తీసుకున్నాడు, అందుకని అతని క్రికెట్ బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. అందుకని భారత జట్టులో కె.ఎల్. రాహుల్ స్థానం లో అఖిల్ ని పెట్టండి అని నెటిజన్స్ ఆడుకుంటున్నారు.