NetflixPandaga: ప్రేక్షకులకు పండగ కానుక.. ఓటీటీలో 18 తెలుగు సినిమాల స్ట్రీమింగ్..
ABN, First Publish Date - 2023-01-14T19:37:58+05:30
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 2023లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్ణయించుకుంది. అందువల్ల పలు సినిమాల డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. భోగి సందర్భంగా ఆ మూవీల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనేక సినిమాలున్నాయి.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలీవుడ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. తెలుగులో రూపొందిన చిత్రాలు ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ భారీ స్థాయి వసూళ్లను రాబట్టాయి. అందువల్ల ఓటీటీ సంస్థలు తెలుగు వైపు దృష్టిసారిస్తున్నాయి. టాలీవుడ్‌లో రూపొందే సినిమాలకు భారీ ధరలను చెల్లిస్తున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్‌లో పోటీ అధికంగా ఉండటంతో ఫ్యాన్సీ రేటును చెల్లించడానికి కూడా ఓటీటీలు వెనుకాడం లేదు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కూడా 2023లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్ణయించుకుంది. అందువల్ల పలు సినిమాల డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. భోగి సందర్భంగా ఆ మూవీల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనేక సినిమాలున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌పండగ (NetflixPandaga), నెట్‌ఫ్లిక్స్‌లోఏంస్పెషల్ (NetflixLoEmSpecial) ట్యాగ్స్‌తో ఈ చిత్రాల లిస్ట్‌ను ఒక్కొక్కటిగా ప్రకటించింది. దాదాపుగా 18 సినిమాలను స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలిపింది. ఈ లిస్ట్‌లో ..‘భోళా శంకర్’ (Bhola Shankar), ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ (SSMB28), ‘దసరా’ (Dasara), ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square), ‘విరూపాక్ష’ (Virupaksha), ‘బుట్టబొమ్మ’ (Butta Bomma), ‘18 పేజేస్’ (18 Pages), ‘ధమాకా’ (Dhamaka) ‘అమిగోస్’ (Amigos), ‘బడ్డీ’, ‘మీటర్’ వంటి చిత్రాలున్నాయి. ‘అనుష్క 48’, ‘వరుణ్ తేజ్ 12’, ‘కార్తికేయ 8’ ‘వైష్ణవ్ తేజ్ 4’, ఎస్ఎల్‌వీ సినిమాస్‌లో నాగశౌర్య చేయనున్న మూవీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలిపింది. క్రేజీ కాంబినేషన్‌తో రూపొందుతున్న సినిమాలతో సహా చిన్న మూవీల రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ సినిమాల జాబితాతో నెట్‌ఫ్లిక్స్‌ను మరింత మంది సబ్‌స్క్రైబ్ చేస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.