కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nene Saroja: తెలంగాణ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వదిలిన ‘నేనే సరోజ’ టీజర్

ABN, First Publish Date - 2023-09-08T20:20:10+05:30

రచయిత డా. సదానంద్ శారద తన S-3 క్రియేషన్స్ పతాకంపై శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నేనే సరోజ’. ‘ఉరఫ్ కారంచాయ్’ అనేది ట్యాగ్‌లైన్. శాన్వి మేఘన, కౌశిక్ బాబు జంటగా నటించారు. ఈ చిత్ర టీజర్‌ని తెలంగాణ శాసనసభ సభ్యులు ముఠా గోపాల్ తాజాగా విడుదల చేశారు.

Nene Saroja Movie Still

సినిమా అంటే వినోదాత్మకంగానే కాదు ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలన్న ఆలోచనతో, గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా రచయిత డా. సదానంద్ శారద.. S-3 క్రియేషన్స్ పతాకంపై శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నేనే సరోజ’ (Nene Saroja). ‘ఉరఫ్ కారంచాయ్’ అనేది ట్యాగ్‌లైన్. శాన్వి మేఘన, కౌశిక్ బాబు జంటగా నటించారు. ఈ చిత్ర టీజర్‌ని తెలంగాణ శాసనసభ సభ్యులు ముఠా గోపాల్ (Telangan MLA Muta Gopal) తాజాగా విడుదల చేశారు.

టీజర్ విడుదల అనంతరం ముఠా గోపాల్ మాట్లాడుతూ.. సామాజిక అంశాన్ని తీసుకొని సినిమా నిర్మించిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. ఆడపిల్లను ఒక చైతన్యమూర్తిగా, ప్రతిభావంతంగా టీజర్‌లో చూపించారు. ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్ధిని పాత్రలో శాన్వి మేఘన పవర్ ఫుల్‌గా నటించింది. టీజర్, టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం విజయవంతమవ్వాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అనంతరం దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ.. ఆడపిల్లల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్షత చూపేవారికి ‘తాగిస్తం కారంచాయ్’ అంటూ గుణపాఠం చెబుతుంది ఈ చిత్రంలో హీరోయిన్ సరోజ. మంచి కంటెంట్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. (Nene Saroja Teaser Launched)


రచయిత, నిర్మాత డా. సదానంద్ శారద మాట్లాడుతూ.. వరంగల్ కోట వంటి ఆహ్లాదకరమైన చారిత్రక ప్రదేశాలు, హృద్యమైన సంగీతం, ఆలోచనాత్మక సంభాషణలు, శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు, ఆర్.యస్. నంద హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. మా చిత్ర టీజర్‌ను ఆవిష్కరించి, మా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌గారికి ధన్యవాదాలని అన్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో

*********************************

*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్

**********************************

*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..

**********************************

*Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత

**********************************

*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

**********************************

*Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..

************************************

Updated Date - 2023-09-08T20:20:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!