Naveen Yerneni: మైత్రీ నిర్మాతకు అస్వస్థత..!
ABN, First Publish Date - 2023-04-21T18:32:58+05:30
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers) నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని (Naveen yerneni Hospitalized) అస్వస్థతకు గురయ్యారు.
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers) నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని (Naveen yerneni Hospitalized) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఇంటికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రక్తపోటు అధికం కావడంతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు రాత్రికే డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. గత మూడ్రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయం, ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే! (IT raids on Mythri Movie makers)
ఇటీవల విడుదలైన భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగాఅధిక మొత్తంలో డబ్బు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించిన పన్ను చెల్లింపులో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టారని, ఆ ఒత్తిడితోనే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.
శ్రీమంతుడు(Srimanthudu), జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి హిట్ చిత్రాలను మైత్రీ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ‘పుష్ప2’(Pushpa2), ఉస్తాద్ భగత్‌సింగ్, ఎన్టీఆర్ 31(NTR31), రామ్‌చరణ్ 16 (RC16) చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటితోపాటు చిన్న బడ్జెట్ చిత్రాలపై కూడా దృష్టిపెట్టారు.