సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MissShettyMrPolishetty: మినిస్టర్ మల్లారెడ్డి మీద నవీన్ పోలిశెట్టి షాకింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2023-07-12T11:48:18+05:30

మినిస్టర్ మల్లారెడ్డి ఈమధ్య బాగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే అతని ఏ ఫంక్షన్ కి వెళ్లినా అతని స్పీచ్ వెరైటీ గా ఉంటుంది, అందుకని. నటుడు నవీన్ పోలిశెట్టి మల్లారెడ్డి కాలేజీకి వెళ్లి తన సినిమా ప్రచారంలో భాగంగా మల్లారెడ్డి ని ఏమన్నాడు అంటే...

Anushka Shetty and Naveen Polishetty
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty) ఒక వైవిధ్యమైన నటుడు. అతను ఈరోజు అనుష్క (AnushkaShetty) తో 'మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి' #Miss.ShettyMr.Polishetty అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రచారాన్ని నవీన్ తన భుజాలపై వేసుకొని రెండు రాష్ట్రాల్లో విపరీతంగా పర్యటిస్తూ తన సినిమా గురించి చెప్తున్నాడు. అయితే నవీన్ ఈ స్థాయికి రావటానికి అతని కృషి ఎంతో వుంది. చాలా కష్టపడ్డాడు. ముందు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' #LifeIsBeautiful అనే సినిమాలో ఒక పాత్ర చేసాడు, తరువాత బాలీవుడ్ వెళ్లి అక్కడ కొన్ని వీడియోస్ చేసాడు. బాగా పాపులర్ అయ్యాడు. హిందీ సినిమా చేసాడు. మహేష్ బాబు (MaheshBabu) కథానాయకుడిగా నటించిన '1 నేనొక్కడినే' (1 Nenokkadine) సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసాడు. ఇలా చేసుకుంటూ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' (AgentSaiSrinivasAthreya) అనే సినిమాతో తాను నటుడిగా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇంకా వెనక్కి చూసుకోలేదు, తరువాత 'జాతి రత్నాలు' #JathiRatnalu ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. నవీన్ కథ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఇలా అన్నిటిలో మంచి అనుభవం వుంది. అందుకే వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు 'మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి' #MissShettyMrPolishetty అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ప్రచారానికి సిఎంఆర్ కాలేజీకి (CMR College) వెళ్ళాడు. అక్కడ మినిస్టర్ మల్లారెడ్డిని (Minsiter Mallareddy) అనుకరిస్తూ నవీన్ చేసిన స్పీచ్ విద్యార్థులను అలరించింది.

"మీ పెద్దాయన మల్లారెడ్డి సర్ ఉంటారేమో అనుకొని వచ్చాను. అయన స్టైల్ గానీ, స్పీచ్ గానీ అంటే నాకు చాలా ఇష్టం" అంటూ అయన స్టైల్ లో చెప్పుకొచ్చాడు. "కష్ట పడ్డా. ఇన్ని హిట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లచ్చినాయి, నేనేమైన మాయ జేషినానా, మంత్రం జేషినానా, కష్ట పడ్డా, స్కిట్లు రాషినా, యూట్యూబ్ లో వీడియోలో జేషినా, అనుష్కతో హీరో గా జేషినా... సక్సెస్ అయినా," అంటూ మినిస్టర్ మల్లారెడ్డి స్టైల్ లో స్పీచ్ ఇచ్చాడు. అక్కడ స్టూడెంట్స్ అందరూ నవీన్ స్పీచ్ కి మొత్తం ఫిదా అయ్యారు.

Updated Date - 2023-07-12T11:48:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!