Natti Kumar: సీబీఎన్ అరెస్ట్‌ను ఖండిస్తున్నా.. చిత్ర పరిశ్రమలో నందమూరి అభిమానులు ఏమైపోయారు?
ABN, First Publish Date - 2023-09-12T19:10:22+05:30
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పట్ల నిర్మాత నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు అంటే సినీ పరిశ్రమ - సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు. పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ఆయన్ను అరెస్ట్ చేస్తే సినీ పరిశ్రమ స్పందించకపోవడం బాధాకరం’’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అరెస్ట్ పట్ల నిర్మాత నట్టికుమార్ (natti kumar) ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు అంటే సినీ పరిశ్రమ - సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు. పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ఆయన్ను అరెస్ట్ చేస్తే సినీ పరిశ్రమ స్పందించకపోవడం బాధాకరం’’ అని అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘మొదటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని. తెలుగుదేశం పార్టీని ఏ రోజు సపోర్ట్ చేయలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఉంటే మంచిదని బావిస్తుంటాను. చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపు పనులు చేయలేదు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదు. జనాల్లో ఉండాలి. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్ సహా చిరంజీవి, మురళీమోహన్, అశ్వనీదత్, రాజమౌళి, దామోదరప్రసాద్ వంటి సినీ ప్రముఖులతో పాటు తుమ్మల ఇంటి పేరును నందమూరిలాగా ఫీలయ్యే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ కానీ ఇతర సినీ పరిశ్రమ పెద్దలెవరూ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించకపోవడం దారుణం. వాస్తవానికి పరిశ్రమలో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఎక్కువ అనే పేరుంది. వీళ్ళు అంతా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాకు ఇవి కావాలి!...అవి కావాలి! అని లబ్ది పొందిన వారే. ప్రతీ సందర్భంలో సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారు. ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వం. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్ జగన్ ఉరితీస్తాడా? చంద్రబాబు చేసిన సేవలను గౌరవించి ఆయనకు అండగా నిలబడాలి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నందమూరి అభిమానులు ఏమైపోయారు. ఎందుకు స్పందించడం లేదు? అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
పవన్ మద్దతు ఇచ్చి అసలైన హీరో అనిపించుకున్నాడు...
‘‘వెనకాల నుంచి సపోర్ట్ చేేసవాళ్లు దొంగలు. ముందుండి మద్దతు ఇచ్చిన అసలైన హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకుగా ముందడుగు వేసి మద్దతు ఇచ్చారు. సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దు. వైఎస్ జగన్ ప్రజలకు ప్రమాదం. చంద్రబాబు భోళా శంకరుడు. ఆయన ఏ రోజు కక్షసాధింపు పనులు చేయలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డిని కక్షపూరితంగా ఏనాడూ చూడలేదు’’ అని పేర్కొన్నారు.