కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RGV Vyooham: వైఎస్ జగన్ కి అనుకూలంగా తీసిన వ్యూహం విడుదల ఆపాలి: నట్టి కుమార్

ABN, First Publish Date - 2023-10-20T18:03:11+05:30

రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' కి షాక్ తగలబోతోందా? ఎందుకంటే నిర్మాత నట్టి కుమార్, కేంద్ర ఎన్నికల కమిషనర్ కి 'వ్యూహం' సినిమా వైఎస్ జగని, అతని పార్టీ కి అనుకూలంగా, ప్రతిపక్షాలను తగ్గిస్తూ చూపించాడని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున ఈ సినిమా ప్రభావం ఉంటుందని అందుకని ఈ సినిమా విడుదల అప్పలని విజ్ఞప్తి చేశారు.

Natti Kumar with advocate Kesapuram Sudhakar

నిర్మాత నట్టి కుమార్ (NattiKumar) తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి ఎటువంటి రాజకీయ, ఇతర సమస్యల గురించి మాట్లాడుతూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu) అక్రమ అరెస్టు ని పరిశ్రమనుండి ఖండించిన మొదటి వ్యక్తి నట్టి కుమార్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) తీసిన 'వ్యూహం' #Vyooham సినిమా వైస్సార్సీపీకి (YSRCP), వైఎస్ జగన్ (YSJagan) కి అనుకూలంగా, అలాగే ప్రతిపక్షాలను ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (PawanKalyan), సోనియా గాంధీ (SoniaGandhi) లాంటి వాళ్ళను ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారని, అందువలన ఈ సినిమా విడుదలని ఆపు చెయ్యాలని నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఎన్నికల కోడ్ కూడా ఇప్పుడు అమలులో ఉందని, ఈ సమయంలో ఈ 'వ్యూహం' సినిమా విడుదల మంచిది కాదని, నట్టి కుమార్ భావించి ఈ సినిమా విడుదల ఆపు చేయాల్సిందిగా కోరుతున్నారు. 'వ్యూహం' నవంబర్ 10వ తేదీన విడుదలకు సన్నద్ధం అయింది. అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా కేంద్ర చీఫ్ ఎలక్షన్స్ కమీషనర్ (ChiefElectionsCommissioner) కు, అలాగే తెలంగాణ చీఫ్ ఎలక్షన్స్ కమీషనర్ కు, కేంద్ర హోమ్ శాఖకు 'వ్యూహం' సినిమాను ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల తెలంగాణాలో విడుదల కాకుండా నిలుపుదల చేయాలని కోరుతున్నారు నట్టి కుమార్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి (YSRCP) పూర్తి అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా రూపొందించిన ఈ పొలిటికల్ సినిమా విధులకు ముందే వివాదాస్పదం కావడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాసరి కిరణ్ కుమార్ (DasariKiranKumar) గారు ఈ సినిమాకి నిర్మాత. పూర్తి అధికార పార్టీ అండదండలతో ఈ సినిమా తెరకెక్కింది. దాంతో ఈ సినిమా పూర్తిగా వన్ సైడ్ గా వారికి అనుకూలంగా, రూపొందించారు. ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీ వారి పాత్రలను వ్యంగంగా చిత్రీకరించి తక్కువ చేసి చూపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ (TeluguDesamParty) జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధి (SoniaGandhi), మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (ManmohanSingh) తదితరుల పాత్రలకు పోలికలు దగ్గరగా ఉన్న డూప్ ఆర్టిస్టులను పెట్టి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా వివాస్పదంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, ఆయనను పాజిటివ్ గా చూపిస్తూ, ఇతర నాయకులను తక్కువగా చేసి చూపిస్తూ తీసిన ఈ సినిమా ప్రభావం ప్రస్తుతం జరగబోయే తెలంగాణ ఓటర్లపైన కూడా ఎంతో ఉండనుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలు కు సంబందించిన అంశాలు కూడా ఈ సినిమాలో పెట్టారు.

గతంలో 2019వ సంవత్సరంలో వర్మ రూపొందించిన పొలిటికల్ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను కూడా ఎలక్షన్ కోడ్ సమయంలో రిలీజ్ చేయాలని ప్రయత్నించగా ఎలక్షన్ కమీషన్ ఆ సినిమా విడుదలను ఆపివేసింది. ఓటర్లపై ఎంతో ప్రభావం చూపనున్న ఈ సినిమా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ సమయంలో తెలంగాణాలో విడుదలైతే, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు కొందరిని డూప్ పాత్రలలో తక్కువ చేసి చూపిస్తుండటం వల్ల ఓటర్లపై కూడా ప్రభావం ఉంటుంది. దయచేసి 'వ్యూహం' సినిమా విడుదలను ఎలక్షన్స్ పూర్తయ్యేంతవరకు ఆపాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.

Updated Date - 2023-10-20T18:04:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!