Pavitra Naresh: పెళ్లి గురించి అడిగితే జవాబు దాటేశాడు
ABN, First Publish Date - 2023-03-11T12:55:38+05:30
నిన్న ట్విట్టర్ లో విడుదల చేసిన నరేష్ మ్యారేజ్ వీడియో గురించి అతన్నే అడగగా సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఆ విషయాన్ని దాటేశాడు. ఇంటింటి రామాయణం వింతయినా ప్రేమాయణం అంటూ ఎదో చెప్పుకొచ్చాడు.
సీనియర్ నటుడు నరేష్ (VK Naresh) నిన్న (శుక్రవారం) ఒక వీడియో విడుదల చేశారు. అందులో నరేష్, పవిత్ర (#NareshPavitra) పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. మూడు ముళ్ళు, ఏడు అడుగులు అంటూ ఎదో కవిత్వం రాసి ఆశీస్సులు కావాలని నరేష్ అడిగాడు. ఈ వీడియో, వార్త రెండూ వైరల్ అయ్యాయి. (#PavitraNareshMarriage) అయితే మరి పెళ్లి చేసుకున్న కొత్త పెళ్ళికొడుకు నిన్న 'ఇంటింటి రామాయణం' కి మామూలుగానే వచ్చాడు. పెళ్లి అయినా దాఖలాలు ఎక్కడా కనిపించనే లేదు. (#PavitraNaresh) మరి ఇంతకీ ఆ వీడియో సంగతి ఏంటి?
అదే విషయం నరేష్ ని ఆ ప్రెస్ మీట్ లో అడిగితే జవాబు ఇవ్వకుండా దాటేశాడు. 'ఇంటింటి రామాయణం' గురించి అడగండి, టాపిక్ పక్కకి వెళ్లొద్దు అని అంటూ నే, ఇంటింటి రామాయణం వింతయిన ప్రేమాయణం అన్నాడు. అది వూరికే ప్రాంక్ వీడియో అని అడిగితే, దానికి కూడా సమాధానం చెప్పలేదు. PavitraNareshMarriage "ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెపుతా", అన్నాడు.
ఇంకొక జర్నలిస్ట్ ఏంటి నరేష్ గారూ, 'ఓన్లీ సోషల్ మీడియా లోనే పెళ్లి చేసుకుంటారా, మమ్మల్ని పిలవరా' అని అంటే, దానికి కూడా సమాధానం దాటేశాడు నరేష్. ఇంకోరోజు ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు అన్నీ డిటైల్డ్ గా మాట్లాడతా అని చెప్పాడు నరేష్. (Naresh Biopic) ఈ వీడియో నరేష్ మీద తీస్తున్న బయోపిక్ సినిమాలోది అని అర్థం అవుతోంది. ఎం.ఎస్. రాజు దీనికి దర్శకుడు కాగా, ఈ సినిమా ఓ.టి.టి. లో విడుదల అయ్యే ఛాన్స్ వుంది. అందుకే ముందుగానే ఇలా వీడియోస్ విడుదల చేసి, పబ్లిసిటీ చేసుకుంటున్నాడు నరేష్ అని కొందరు అంటున్నారు.
ఇది కూడా చదవండి:
ఆ లిప్ లాక్ నరేష్ బయోపిక్ సినిమాలోది