MalliPelli: నరేష్ పవిత్రల పెళ్లి రోజు ఫిక్స్ అయింది
ABN, First Publish Date - 2023-05-03T12:35:44+05:30
సీనియర్ నటుడు వి.కె. నరేష్, పవిత్రల మళ్ళీ పెళ్లి తేదీ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. మే 26వ తేదీగా నరేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
సీనియర్ నటుడు నరేష్ (VK Naresh) ఇప్పుడు తన జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దానికి 'మళ్ళీ పెళ్లి' #MalliPelli అని టైటిల్ కూడా పెట్టాడు. ఎంఎస్ రాజు MSRaju దీనికి దర్శకుడు కాగా, నరేష్ #VKNaresh ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో నరేష్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావన ఉంటుంది అని ఇప్పటివరకు విడుదల అయిన ఈ ప్రచార చిత్రాల ఆధారంగా తెలిసింది. నరేష్ ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ (PavitraLokesh) తో ఉంటున్నాడు, ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఆ పెళ్లి కి ఇంకా కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని తెలుస్తోంది.
ఈలోగా ఈ 'మళ్ళీపెళ్లి' #MalliPelli టీజర్ చాలా వైరల్ అయింది. నరేష్ తన సాంఘీక మాధ్యమంలో అప్పుడప్పుడు పవిత్రతో తన పెళ్లి, గుడ్ న్యూస్ చెపుతా, డేట్ చెపుతా, అంటూ ఏవేవో పెట్టి చివరికి అది సినిమా అని తేల్చి పారేసాడు. అయితే అతని వ్యక్తిగత జీవితంతో ఇది ముడిపడి ఉండటం వలన ఈ టీజర్ బాగా వైరల్ అవ్వడానికి ఉపయోగపడింది. అతని మూడో భార్య రమ్య రఘుపతి #RamyaRaghupathi రోల్ వనిత విజయ్ #VanithaVijayKumar కుమార్ వేసింది. ఆసక్తికరం ఏంటంటే వనిత విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితం కూడా ఆ పాత్రకి సరిగ్గా సరిపోయేట్టు ఉంటుంది.
ఇంకా ఇందులో నరేష్ భార్యగా పవిత్ర వేసింది, ఇప్పుడు ఆమెని అందరూ పవిత్ర నరేష్ #PavitraNaresh అని అంటున్నారు. ఆమె చాలా కాలం నుండి నరేష్ తోటే ఉంటోంది అని అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా, ఈ 'మళ్ళీ పెళ్లి' చిత్రాన్ని మే 26న విడుదల చేస్తున్నట్టు నరేష్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సినిమాలో నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి పాత్రల చుట్టు కథ తిరుగుతుందా లేక కృష్ణ గారి #SuperStarKrishna ని కూడా నరేష్ పెట్టాడా అన్నది చూడాలి.