MalliPelli: చిక్కుల్లో నరేష్, పవిత్ర 'మళ్ళీపెళ్లి' సినిమా... సీన్లోకి రమ్య రఘుపతి !
ABN, First Publish Date - 2023-05-25T14:39:00+05:30
పరిశ్రమలో టాక్ అఫ్ ది టౌన్ గా నడుస్తున్న సినిమా 'మళ్ళీ పెళ్లి'. ఎందుకంటే ఇందులో నరేష్, పవిత్ర లోకేష్ లీడ్ పెయిర్ కాగా, ఇది ఎంఎస్ రాజు దర్శకత్వం చేశారు. ఐదు నరేష్ నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని అంటున్నారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కోర్టుని ఆశ్రయించారు.
నరేష్ (VKNaresh), పవిత్ర లోకేష్ (PavitraLokesh) నటించిన 'మళ్ళీపెళ్లి' #MalliPelli విడుదలకి అడ్డంకులు వచ్చేలా కనపడుతోంది. ఎందుకంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (RamyaRaghupathi) ఈ సినిమాలో చాలా అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని, ఆ సన్నివేశాలను తీసేయాలని కూకట్ పల్లి (Kukatpally) లోని ఫామిలీ కోర్ట్ (FamilyCourt) ని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఈ 'మళ్ళీపెళ్లి' సినిమాకి ఎంఎస్ రాజు (MSRaju) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ ఇలా చాలా ప్రచార వీడియోలు విడుదల చేశారు. అయితే ఇవన్నీ నిజ సంఘటనలు అని చిత్ర నిర్వాహకులు చెప్పటం లేదు కానీ, ఆ సన్నివేశాలన్నీ చూస్తుంటే మాత్రం నరేష్ నిజ జీవితంలో ముఖ్యంగా మూడో భార్య విషయంలో జరిగే సంఘటనల ఆధారంగా తీసినట్టుగా కనిపిస్తున్నాయి అని పరిశ్రమలోనూ, పబ్లిక్ లోనూ అనుకుంటున్న మాట.
అందుకనే రమ్య రఘుపతి (RamyaRaghupathi) కోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. నరేష్, రమ్య రఘుపతిల మధ్య కొంత కాలంగా ఒకరి మీద ఒకరు చాలా ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. రమ్య, నరేష్ ల వ్యవహారం కూడా ఇప్పుడు కోర్టులో వున్నట్టుగా తెలిసింది. మధ్యలో పవిత్ర లోకేష్ నరేష్ కి చేరువ కావటం, పవిత్ర, నరేష్ ఇంట్లోనే ఉండటం ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. రమ్య రఘుపతి కూడా నరేష్, పవిత్రని ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ ఆరోపణలు చెయ్యడం, ఇలా కోర్టుకి ఎక్కడం వంటి విషయాలు కూడా తెలిసినవే.
బెంగుళూరులో నరేష్, పవిత్ర లు ఉంటున్న #PavitraNaresh హోటల్ రూమ్ కి వెళ్లి రమ్య రఘుపతి అప్పట్లో గొడవ చేసిన సంగతి తెలిసిందే. అయితే అటువంటి సన్నివేశమే ఈ 'మళ్ళీపెళ్లి' సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రంలో చూడొచ్చు కూడా. ఏమైనా కూడా ఈ 'మళ్ళీపెళ్లి' కి ఇప్పటికే ఇలా కావలసినంత ప్రచారం వచ్చేసింది. ఈ శుక్రవారం ఇది థియేటర్లలో విడుదల కావాల్సి వుంది.
మరి రమ్య కోర్టుకి వెళ్లి ఏమైనా ఈ సినిమా ఆపగలరా, లేదా సెన్సార్ అయిపోయిన సినిమాలని కోర్టులు ఈమధ్య మేము ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేసిన సందర్భాలు కూడా వున్నాయి కదా. ఇప్పుడు రమ్య ఏమి చెయ్యబోతున్నారు అన్నదానిమీదే ఉత్కంఠగా పరిశ్రమలో చూస్తున్నారు.