Narasimha nandi : జేడీ లక్ష్మీనారాయణ క్లాప్‌తో ప్రారంభమైన ‘సిగ్గు’
ABN, First Publish Date - 2023-09-10T17:27:52+05:30
జాతీయ అవార్డు గ్రహీత నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై 116వ ‘సిగ్గు’ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్ ఇవ్వగా, కె. విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
జాతీయ అవార్డు గ్రహీత నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై 116వ ‘సిగ్గు’ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్ ఇవ్వగా, కె. విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి వి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్ స్ర్కిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘నేను చిత్ర పరిశ్రమకి వచ్చి కచ్చితంగా 20 సంవత్సరాలు పూర్తయింది. మొదటి నుంచి నన్ను అభిమానించి అక్కున చేర్చుకున్న వ్యక్తి కళ్యాణ్ గారు. ఆయన సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాను’’ అని అన్నారు.
జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘‘సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీయాలని సమాజాన్ని పాడు చేసే సినిమాలు తీయకూడదు అని నేను క్లాప్ కొట్టాను. చిత్ర బృందం మంచి సినిమా తీస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు.
దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ ‘‘రామ సత్యనారాయణగారి బ్యానర్‌లో గతంలో కూడా పని చేశా. నాపై నమ్మకంతో ఆయన ఏరోజు సెట్‌లో అడుగుపెట్టరు. పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. చలం గారి నవల సుశీల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నా. నటీనటుల ఎంపిక పూర్తయిన తర్వాత ఇతర వివరాలు వెల్లడిస్తా’’ అన్నారు.