Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..
ABN, First Publish Date - 2023-03-23T19:32:28+05:30
సినీ పరిశ్రమలో ఎటువంటి అండదండలు లేకుండా స్వ శక్తితో ఎదిగిన నటుడు నాని (Nani). అభిమానులందరు ముద్దుగా నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదల కానుంది.
సినీ పరిశ్రమలో ఎటువంటి అండదండలు లేకుండా స్వ శక్తితో ఎదిగిన నటుడు నాని (Nani). అభిమానులందరు ముద్దుగా నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాను కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
‘‘కెరీర్ ఆరంభంలో సినీ ఇండస్ట్రీ చాలా కష్టంగా అనిపించింది. నాకు ఇక్కడ ఏం అర్థమయ్యేది కాదు. పరిచయస్తులు ఎవరూ లేరు. నేర్చుకునే దశలో ఉన్నాను కాబట్టి కాస్త ఇబ్బందిగా అనిపించింది. నేను ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నా. ఆ వివరాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. వేరే వారితో పోల్చుకుంటే సినీ పరిశ్రమలో నేను పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొలేదని అనుకుంటున్నాను. నాకంటే ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడిన వాళ్లు నాకు తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ అందులోను క్లాప్ అసిస్టెంట్‌గా ఉంటే ఎన్నో అవమానాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు మనతో ఏదైనా చెప్పేయొచ్చని అనుకుంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వాళ్లందరికీ సమాధానం చెప్పాలని ఉన్నా అన్నింటినీ దిగమింగి పని చేయాలి. అలాంటి ఎన్నో ఇబ్బందులు నేను ఎదుర్కొన్నా. క్లాప్‌బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారు. మాటలు పడినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ, ఓ దర్శకుడు మాత్రం సెట్లో అందరి ముందు నన్ను అవమానించారు. నేను ఎప్పటికీ దర్శకుడిని కాలేనని అన్నారు. ఆ మాటతో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ విధంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొని నేను ఈ స్థాయికి ఎదిగా. స్టార్ హీరోగా మారాక ఆ దర్శకుడిని కలిశా. అప్పుడు కూడా మా చుట్టూ ఉన్న వాతావరణం ఏ మాత్రం మారలేదు’’ అని నాని చెప్పారు.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..
Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా
Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు
Allu Arjun: హీరోయిన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!