కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nani : విజయ్‌ - రష్మిక వీడియోపై స్పందించిన నాని!

ABN, First Publish Date - 2023-12-03T15:04:06+05:30

‘హాయ్‌ నాన్న’ (Hai nanna(ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ, రష్మిక ఫొటోలను స్ర్కీనపై ప్రదర్శించడం పెద్ద చర్చకే దారి తీసింది. జరిగిన పొరపాటుకు విజయ్‌ అభిమానులు, నెటిజన్లు ఈవెంట్‌ నిర్వాహకులతోపాటు చిత్రబృందాన్నీ తప్పుబట్టారు. తాజాగా ఈ ఇష్యూపై నాని స్పందించారు.

‘హాయ్‌ నాన్న’ (Hai nanna(ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ, రష్మిక ఫొటోలను స్క్రీన్ పై ప్రదర్శించడం పెద్ద చర్చకే దారి తీసింది. జరిగిన పొరపాటుకు విజయ్‌ అభిమానులు, నెటిజన్లు ఈవెంట్‌ నిర్వాహకులతోపాటు చిత్రబృందాన్నీ తప్పుబట్టారు. తాజాగా ఈ ఇష్యూపై నాని స్పందించారు. ఈ నెల 8న హాయ్‌ నాన్న చిత్రం విడుదల నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్న నాని ఫొటో విషయంపై మాట్లాడారు. ''మా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు విజయ్‌ దేవరకొండ, రష్మికకు సంబంధించిన ఫొటోలను స్క్రీన్ పై వేయడం నిజంగానే దురదృష్టకరం. ఆ ఫోటో చూసి మేము కూడా షాకయ్యాం. ఇలాంటి ఈవెంట్స్‌ కోసం ఎంతోమంది పని చేస్తుంటారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మేమంతా స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకూ తెలుసు. అలా జరగడం వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నాతోపాటు ‘హాయ్‌ నాన్న’ టీమ్‌ నుంచి క్షమాపణలు చెబుతున్నాం’’ అని అన్నారు.

ఇక ఈ చిత్రం ప్రమోషనకు హీరోయిన మృణాల్‌ ఠాకూర్‌ దూరంగా ఉంటున్నారనడంలో వాస్తవం లేదు. ఆమె స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అందులో భాగంగా విశ్రాంతి తీసుకుంటూ ప్రమోషన్సతో కనిపించడం లేదు. ఇకపై జరిగే ప్రతి ఈవెంట్‌లోనూ ఆమె ఉంటుంది. (Nani Reaction on Vijaydevarakonda Photo)

వేరే హీరోలతో అంటే..

ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా. నా సినిమాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నా. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో సినిమా చేసి ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నా. సో.. వేరే హీరోల చిత్రాల్లో నటించే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఈ క్రమంలోనే పలు చిత్రాలు వదులుకున్నా.నాకు రీమేక్స్‌ నటించడం నాకు పెద్దగా నచ్చదు. ఇప్పటివరకూ రెండు రీమేక్‌ చిత్రాల్లో నటించా. ప్రస్తుతం ఉన్న రోజుల్లో భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలి. నేను ఓటీటీలోకి రావానుకుంటే ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ వంటి ప్రాజెక్ట్‌తో రావాలనుకుంటున్నా. అలాగే, ‘యానిమల్‌’ లాంటి స్టోరీ నా వద్దకు వేస్త తప్పకుండా యాక్ట్‌ చేస్తా’’ అని నాని అన్నారు.

Updated Date - 2023-12-03T15:07:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!