Nandamuri Ramakrishna: ప్రతిభకు పట్టం కట్టారు!
ABN, First Publish Date - 2023-03-13T14:43:02+05:30
95వ ఆస్కార్ వేడుక ముగిసింది. లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్‌లో సినీ సెలబ్రిటీల మధ్య అత్యంత వైభవంగా జరిగిందీ వేడుక. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’(natu natu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకుంది.
95వ ఆస్కార్ వేడుక ముగిసింది. లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్‌లో సినీ సెలబ్రిటీల మధ్య అత్యంత వైభవంగా జరిగిందీ వేడుక. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’(natu natu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకుంది. ఈ తరుణంలో ఆర్‌ఆర్‌ఆర్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై నందమూరి రామకృష్ణ (nandamuri Ramakrishna) స్పందించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆస్కార్ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ద్వారా మన పరిశ్రమ సత్తా చాటింది. ముఖ్యంగా తెలుగోడి సినీ కీర్తిని ప్రపంచ శిఖరాలపై నిలబెట్టి తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. నిర్మాత దానయ్య, దర్శకుడు రాజమౌళి, కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, నృత్యరీతుల్ని సమకూర్చిన ప్రేమ్‌రక్షిత్ పాటకు తగ్గట్లు స్టెప్పులేసి మరపించిన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లకు అభినందనలు. ఆస్కార్ తెలుగు సినిమాకు తొలిమెట్టుగా ఆస్వాదిస్తూ, మరెన్నో గొప్ప సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో రావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. (RRR)