కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devil: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా విడుదల వాయిదా

ABN, First Publish Date - 2023-11-01T12:12:35+05:30

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా, సంయుక్త కథానాయికగా నటిస్తున్న పీరియడ్ డ్రామా 'డెవిల్' సినిమా విడుదల వాయిదా వేసినట్టుగా చిత్ర నిర్వాహకులు ఒక అధికారికంగా ప్రకటనలో చెప్పారు. అభిషేక్ నామా దీనికి నిర్మాత, దర్శకుడు.

Kalyan Ram as Devil

నందమూరి కళ్యాణ్ రామ్ (NandamuriKalyanRam) సినిమా 'డెవిల్' #Devil విడుదల వాయిదా పడింది. అభిషేక్ నామా (AbhishekNama) నిర్మాత, దర్శకుడిగా ఈ సినిమా నవంబర్ 24న విడుదల అవుతుంది అని ముందుగా ప్రకటించారు. కానీ ఈరోజు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఎప్పుడు విడుదలయ్యేది అనే విషయం మాత్రం ప్రకటించలేదు.

కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త (Samyuktha) ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఇది ఒక పీరియడ్ డ్రామా, 1947 స్వాతంత్రానికి రాక ముందు జరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ డెవిల్ అనే ఒక గూఢచారిగా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్, అలాగే విఎఫ్ఎక్స్ ఎంతో అవసరమని కూడా తెలుస్తోంది.

ఈ అధికారిక ప్రకటనలో ఈ సినిమా సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాకి ఇంకా మెరుగైన సాంకేతిక అందించాలనే ఉద్దేశంతో, దానికి ఇంకా టైము కావాలని, అందుకనే విడుదలని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాకి ముందుగా నవీన్ మేడారం (NaveenMedaram) దర్శకుడు అని ప్రకటించినా, ఆ తరువాత దర్శకుడుకి, నిర్మాత అభిషేక్ నామా కి మధ్య కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమా నుండి నవీన్ తప్పుకున్నారు.

కానీ చిత్ర నిర్వాహకులు ముందు కొన్ని ప్రచార చిత్రాల్లో నవీన్ పేరు వేశారు, ఆ తరువాత దర్శకుడి పేరే లేకుండా విడుదల చేశారు, ఆ తరువాత మళ్ళీ దర్శకుడిగా అభిషేక్ నామా పేరు వేశారు. అందుకని ఈ చిత్రం కొన్ని నెలల క్రితం వార్తల్లో వున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-11-01T12:12:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!