సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NBK109: ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలీదు

ABN, First Publish Date - 2023-06-10T15:03:36+05:30

నందమూరి బాలకృష్ణ 109 (NBK109) చిత్రానికి శ్రీకారం చుట్టింది సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న కె.ఎస్‌ రవీంద్ర (బాబీ-Ks ravindra) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ 109 (NBK109) చిత్రానికి శ్రీకారం చుట్టింది సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న కె.ఎస్‌ రవీంద్ర (బాబీ-Ks ravindra) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘వయలెన్స్‌ కా విజిటింగ్‌ కార్డ్‌’ ట్యాగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చున్‌ ఫర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శనివారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఆసక్తికర పోస్టర్‌ విడుదల చేశారు. (Violence ka visiting card)

ఓ సూట్‌కేస్‌లో కత్తి, గొడ్డలి, సుత్తి వంటి ఆయుదాలతోపాటు మందు బాటిల్‌, సిగిరెట్‌ పెట్టె ఉన్నాయి. ‘ప్రపంచానికి అతను తెలుసు.. కానీ ఎవరికీ అతని ప్రపంచం తెలీదు’ అనే ట్యాగ్‌లైన్‌ జోడించారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Updated Date - 2023-06-10T15:03:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!