సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BiggBossTelugu7: నాగార్జునకి బదులు ఇంకో నటుడు హోస్ట్ చేస్తున్నారా? ఎవర్రా అది అన్నది...

ABN, First Publish Date - 2023-07-11T12:38:37+05:30

బిగ్ బాస్ 7 సీజన్ వచ్చేస్తోంది, సెప్టెంబర్ మొదటి వారంలో మొదలవబోతోంది అని తెలుస్తోంది. ఈ సీజన్ లో ఎవరు హోస్ట్, కంటెస్టెంట్స్ ఎవరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా...

Akkineni Nagarjuna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగులో పాపులర్ రియాలిటీ షో అయినా 'బిగ్ బాస్' #BiggBoss ఇప్పుడు ఏడో సీజన్ కి తయారవుతోంది. ఈసారి కొంచెం లేట్ గా వస్తోంది, కానీ లేటెస్ట్ గా వస్తోంది అని అంటున్నారు. స్టార్ మా (StarMaa), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లు ఈ షో ని నిర్వహిస్తుండగా, స్టార్ మా ఈ షో ప్రోమో ని విడుదల చేసింది. #BiggBossTelugu7 అయితే ఇది ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు, ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ ఏవీ ఈ ప్రోమోలో చూపించలేదు.

అయితే స్టార్ మా సోర్స్ ప్రకారం బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ BiggBossTelugu7 సెప్టెంబర్ (September first week) మొదటి వారంలో మొదలవ్వచ్చు అని తెలిసింది. ఈ సీజన్ కి నాగార్జున (NagarjunaAkkineni) హోస్ట్ గా కంటిన్యూ అవుతారని తెలిసింది. నాగార్జున కి బదులు ఇంకో నటుడుని ఎంపిక చేశారట కదా, ఈసారి బిగ్ బాస్ షో హోస్ట్ గా అంటే, 'ఎవర్రా అన్నది అది... ఏమీ కాదు.. నాగార్జున కంటిన్యూ చేస్తున్నారు, అతనే చేస్తారు. అతనితో ప్రోమో కూడా షూట్ చేస్తున్నాం', అని అన్నారు మా సోర్స్.

ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేవాళ్ళు బాగా పేరు వుండేవాళ్ళు వెళతారు అని తెలిసింది. ఎందుకంటే గత సంవత్సరం అంతగా పేరులోని వాళ్ళని హౌస్ లోకి పంపారు, కానీ ఈసారి బాగా పేరున్న సెలబ్రిటీస్ హౌస్ లోకి వెళ్లి సందడి చేయనున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో సురేష్ కొండేటి ఒకడు అని కూడా టాక్ వినపడుతోంది. అందుకనే ఎక్కువగా తన మీద ఫోకస్ రావటానికి మీడియా సమావేశాలకు వచ్చి ఇరుకున పెట్టె, పడే ప్రశ్నలు అడుగుతున్నాడు అని అంటున్నారు.

ఏమైనా కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ సందడిగా ఉంటుంది అని మాత్రం అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో వున్న బిగ్ బాస్ హౌస్ ని ఇప్పుడు మొత్తం డిజైన్ మారుస్తున్నారని కూడా తెలిసింది. ప్రతి సంవత్సరం మారుస్తారు, కానీ ఈసారి మాత్రం ఇంకా చాలా డబ్బులు ఎక్కువ పెట్టి, చాలా సుందరంగా హౌస్ ఉండేట్టు చేస్తున్నారు అని వినికిడి.

Updated Date - 2023-07-11T12:38:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!