కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nagarjuna: ఆరు నెలలు దూరంగా.. అదొక అద్భుతం!

ABN, First Publish Date - 2023-08-05T22:07:29+05:30

కింగ్‌ నాగారున (Nagarjuna) కొన్నాళ్ల గ్యాప్‌ తర్వాత సినిమా వేదికపై సందడి చేశారు. ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ (Mr Pregnent) చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణకు ఆయన అతిథిగా హాజరయ్యారు. వేదికపై తన కుమారుడు అఖిల్‌, భార్య అమల గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

కింగ్‌ నాగారున (Nagarjuna) కొన్నాళ్ల గ్యాప్‌ తర్వాత సినిమా వేదికపై సందడి చేశారు. సోహైల్‌ (Sohail) కీలక పాత్ర పోషించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ (Mr Pregnent) చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణకు ఆయన అతిథిగా హాజరయ్యారు. వేదికపై తన కుమారుడు అఖిల్‌, భార్య అమల గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అమల గర్భంతో ఉండగా తాను ఆరునెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అమలతోనే ఉన్నానంటూ నాగ్‌ చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘‘మాతృత్వం అనేది నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. అప్పుడు జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తే. ఆ సమయంలో హలో బ్రదర్‌ చిత్రంలో నటిస్తున్నా. అదే సమయంలో అమల గర్భవతి. ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆరు నెలలు అమలతోనే ఉన్నా. ఏ సినిమా చేయలేదు. చివరికీ డెలివరీ టైంలో కూడా చేయి పట్టుకుని దగ్గరే ఉన్నా. నా లైఫ్‌లో ఆ క్షణాలను మరువలేను. ఓ అద్భుతమైన అనుభవం. నిజంగా మనిషి పుట్టుక అనేది ఓ అద్భుతం’’ అని అన్నారు. సోహెల్‌, రూప జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’. శ్రీనివాస్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Updated Date - 2023-08-05T22:08:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!