సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Agent: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున, అమల ఏమి చేసారో తెలుసా

ABN, First Publish Date - 2023-04-26T13:36:46+05:30

అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున అక్కినేని, అమల 'ఏజెంట్' సినిమా మంచి విజయం సాధించాలని ఏమి చేసారో తెలుసా...

Nagarjuna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిల్ అక్కినేని (AkhilAkkineni) సినిమా 'ఏజెంట్' #Agent రేపు శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమా అఖిల్ కెరీర్ లో ఒక ప్రాముఖ్యమైన సినిమా. సురేందర్ రెడ్డి (Surender Reddy) దీనికి దర్శకుడు కాగా, అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మాత. అఖిల్ దాదాపు రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసం పని చేసాడు. #Agent ఈ సినిమా మీద ఇప్పుడు చాలా ఆశలు పెట్టుకున్నాడు కూడా. ఈ సినిమా కోసమనే అఖిల్ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, తన ఫిజిక్ ని రెండు సంవత్సరాలు ఒకేలా ఉంచడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. #AgentOnApril28

ఈ సినిమా అఖిల్ కి ఎంత ముఖ్యమో, అతని తల్లిదండ్రులు అగ్ర నటుడు నాగార్జున #NagarjunaAkkineni, అమల #Amala కి అంతే ముఖ్యమని అర్థం అవుతోంది. అందుకోసమే నాగార్జున, అమల ఈరోజు తిరుపతి #Tirupati వెళ్లి వేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. అఖిల్ #Agent సినిమా రేపు విడుదల అవుతున్న ఈ సందర్భం లో వీరిద్దరూ తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించటం కొడుకు కోసమనే అర్థం అవుతుంది.

ఎందుకంటే అఖిల్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమా ఇది. ఇందులో అఖిల్ ఏజెంట్ గా కనపడతాడు. ఇది ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి (Mammootty) ఇందులో ఒక ప్రధాన పాత్రలో కనపడతాడు. అలాగే బాలీవుడ్ నటుడు డినో మోరీ (Dino Morea) కూడా విలన్ గా కనిపిస్తాడు అని చెప్పారు. సాక్షి వైద్య (Saakshi Vaidya) ఈ సినిమాతో తన కెరీర్ ని ప్రారంభం చేసింది.

ఈ సినిమా కోసం అఖిల్ కష్టపడటమే కాకుండా, సినిమా అయ్యాక ప్రచారానికి అంతే కష్టపడ్డారు. రోజుకో వూరు తిరుగుతూ, ఈ సినిమా గురించి చాలా ప్రచారాలు చేసాడు. ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చాడు. ఈ సినిమా అతనికి ఒక మంచి బ్రేక్ ఇస్తుందని చాలా నమ్మకంగా వున్నాడు.

Updated Date - 2023-04-26T13:36:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!