కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Naga Chaitanya: అవన్నీ పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం!

ABN, First Publish Date - 2023-12-05T21:26:32+05:30

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దూత’ వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్నారు నాగచైతన్య. ఈ నెల 1న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.

విక్రమ్ కుమార్ (Vikram k kumar) దర్శకత్వంలో ‘దూత’ (Dhootha) వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్నారు నాగచైతన్య. ఈ నెల 1న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది. దీంతో రిలాక్స్‌ అయిన నాగచైతన్య తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫ్లాప్‌ గురించి మాట్లాడారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పరాజయం కావడం బాధ కలిగించలేదన్నారు. (Naga chaitanya)

ఆయన మాట్లాడుతూ ‘‘దూత’లో నా పాత్రకు జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలిసినా.. కచ్చితంగా ఈ సినిమా చేసేవాడిని. ఎందుకంటే ఆ సినిమాలో నేను ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటిస్తాను కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా అంగీకరించేవాడిని. ఆయనతో నటించి నేను చాలా విషయాలు తెలుసుకున్నా. అందుకే దాని ఫలితం నాకు బాధ కలిగించలేదు. ఆ చిత్రంలో భాగమైనందుకు ఇప్పటికీ ఆనందంగా ఉన్నా. అయినా జీవితంలో చాలా ఒడుదొడుకులు ఉంటాయి. అలాగే సినిమాల విషయంలోనూ సక్సెస్‌, ఫెయిల్యూర్‌ కామన. వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలంతే’’ అని అన్నారు.

ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’లో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయిక. వలస మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తారు.

Updated Date - 2023-12-05T21:26:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!