కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Naga Vamsi : పూజా హెగ్డే అందుకే వెళ్లిపోయింది..

ABN, First Publish Date - 2023-10-03T11:09:46+05:30

మహేష్‌ బాబు (Maheshbabu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (guntur karam) హారికా అండ్‌ హాసిని క్రియేషన్స పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. ప్రారంభమై చాలా కాలమైనా సినిమా ఓ కొలిక్కి రాలేదు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్యదేవర నాగవంశీ మరోసారి రూమర్స్‌ను ఖండించారు.

మహేష్‌ బాబు (Maheshbabu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (guntur karam) హారికా అండ్‌ హాసిని క్రియేషన్స పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. ప్రారంభమై చాలా కాలమైనా సినిమా ఓ కొలిక్కి రాలేదు. ఈ మధ్యనే కాస్త వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమాపై వచ్చినన్ని రూమర్స్‌ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాలేదు. మహేష్‌ మాటిమాటికి ఫ్యామిలీ టూర్స్‌ వేయడం వల్ల డిలే అవుతుందని గుసగుసలు వినిపించాయి. తర్వాత కథ మారిందని, రీషూట్‌ చేశారని, సంగీత దర్శకుడు తప్పుకొన్నాడని టాక్‌ నడిచింది. కొన్నాళ్లకు ఆరిస్ట్‌లు, సాంకేతిక నిపుణుల్లో మార్పు జరిగాయి. పాట వాళ్లు బయటకు వెళ్లిపోవడం మళ్లీ కొత్తవాళ్లు రీప్లేస్‌ కావడం జరిగింది. అలాగే హీరోయిన పూజాహెగ్డే కూడా పలు కారణాలతో ఈ చిత్రం నుంచి బయటకు వెళ్లింది. ఇప్పటికే ఈ విషయాలపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మరోసారి రూమర్స్‌ను ఖండించారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో ఎందుకు నటించడంలేదో చెప్పుకొచ్చారు. (pooja hegde)

‘‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేద్దామనుకున్నాం. తర్వాత 2024 జనవరి 12కు మార్చాం. దాంతో కంగారులేకుండా నెమ్మదిగా షూటింగ్‌ చేయాలనుకున్నాం. అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చింది. డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో ఆమెను రీప్లేస్‌ చేశాం. దానికే కొందరు నానా హంగామా చేశారు. అంత చేయాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థంకాదు. పండగ సీజన్ కు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి. మహేశ్‌ బాబు క్యారెక్టర్‌ విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతానికి రెండు సాంగ్స్‌ రెడీ అయ్యాయి. ఫస్ట్‌ సింగిల్‌ త్వరలోనే విడుదల చేస్తాం. సంక్రాంతికి పక్కా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని స్పష్టం చేశారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథానాయికలుగా పూజాహెగ్డే, శ్రీలీల ఎంపిక కాగా పూజా ఈ చిత్రం నుంచి తప్పుకొంది. ఆ స్థానంలో మీనాక్షి చౌదరిని రెండో నాయికగా సెలెక్ట్‌ చేశారు. తమ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఇతర చిత్రాల గురించి మాట్లాడుతూ ‘‘విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రంలో శ్రీలీల హీరోయినగా నటిస్తోంది. అందులో ఎలాంటి మార్పు లేదు. రష్మికను ఎంపిక చేశామని ఇటీవల వచ్చిన వార్తల్లో నిజం లేదు. మేం అసలు ఆమెను సంప్రదించలేదు. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మిస్తున్నాం. అది ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’, విశ్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, సిద్థు జొన్నలగడ్డ ‘టిల్లు స్వ్కేర్‌’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. తర్వాత, అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా, ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా చేయనున్నాం’’ అని అన్నారు .

Updated Date - 2023-10-03T11:10:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!