Naga Shourya: రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొట్టావ్.. సారీ చెప్పు.. నాగశౌర్య ఫైర్
ABN, First Publish Date - 2023-02-28T18:13:29+05:30
హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా తనదైన శైలి పాత్రలతో ముందుకెళ్తున్నారు. తన సినిమాల్లోలాగే నిజజీవితంలోనూ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాడు.
హీరో నాగశౌర్య (Naga shourya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా తనదైన శైలి పాత్రలతో ముందుకెళ్తున్నారు. తన సినిమాల్లోలాగే నిజజీవితంలోనూ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాడు. తాజాగా జరిగిన ఓ సంఘటనలో మహిళలపై తనకున్న గౌరవాన్ని మరోసారి చూపించాడు. నడిరోడ్డుపై ఒక యువతికి జరిగిన చిన్న సంఘటనను తట్టుకోలేని శౌర్య రోడ్డుపైనే రచ్చ చేశాడు. విషయంలోకి వెళ్తే.. మంగళవారం ఉదయం నాగశౌర్య కారులో ప్రయాణిస్తుండగా నడిరోడ్డుపై ఒక యువకుడు.. తన లవర్‌పై చేయి చేసుకున్నాడు (Naga shourya Fire on man on road). ఇది చూసిన నాగ శౌర్య కారు దిగి ఆ యువకుడిని అడ్డుకున్నాడు. ‘నడిరోడ్డుపై అమ్మాయిని కొడతావా.. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ యువకుడు ‘తను నా లవర్ అని, తాను కొట్టలేదని’ చెప్పుకొచ్చాడు. ‘‘ ఆ అమ్మాయి సైతం లవర్‌కి సపోర్ట్‌గా మాట్లాడింది. తనేమి కొట్టలేదని, మమ్మల్ని వదిలేయమని అడిగింది. అయినా ఒక అమ్మయిని నడిరోడ్డుపై చేయి చేసుకోవడం ఏంటని నాగశౌర్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడున్న వారంతా గటిగా అడగడంతో యువకుడు, అమ్మాయిని క్షమాపణ కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వాడి లవర్ని వాడు కొట్టుకుంటాడు మీకెందుకు అని కొందరు కామెంట్ చేస్తే, మంచి పని చేశారు.. రియల్ హీరో అనిపించుకున్నారు అని ఇంకొందరు కామెంట్ చేశారు. (Phalana Abbayi Phalana Ammayi)
ఇటీవల నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఫలాన అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.