PopCorn: చైతూ ఆవిష్కరించిన ‘మది విహంగమయ్యే..’ లిరికల్
ABN, First Publish Date - 2023-01-18T18:41:09+05:30
అవికా గోర్ (Avika Gor), సాయి రోనక్ (Sai Ronak) జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’ (Popcorn). ఎం.ఎస్. చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై
అవికా గోర్ (Avika Gor), సాయి రోనక్ (Sai Ronak) జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’ (Popcorn). ఎం.ఎస్. చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియన్, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మురళి నాగ శ్రీనివాస్ గంధం (Murali Naga Srinivas Gandham) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ‘మది విహంగమయ్యే...’ (Madhi Vihangamayye) అనే లిరికల్ సాంగ్‌ను యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) విడుదల చేసి.. సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) ద్వారా ఈ పాట మార్కెట్‌లోకి విడుదలైంది.
పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని చక్కటి లిరిక్స్‌తో పాటలో పొందు పరిచారు లిరిక్ రైటర్ శ్రీజో. శ్రవణ్ భరద్వాజ్ (Shravan Bharadwaj) సంగీతం అందించిన ఈ పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా ఆలపించారు.
ఈ పాట విడుదల సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్. చలపతి రాజు (MS Chalapathi Raju) మాట్లాడుతూ ‘‘ ‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుంది. పెద్దలకు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వస్తుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ మురళి గంధం టేకింగ్‌ను అందరూ తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు’’ అని అన్నారు. సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అవికా గోర్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ మూవీ . డైరెక్టర్ మురళిగారి నెరేషన్ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాను. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం’’ అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘‘సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్షకులు సినిమాలోకి లీనమైపోతారు. ఇక చివరి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మూవీ అలరిస్తుంది’’ అన్నారు.