Viraj Ashwin: ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటోన్న యంగ్ హీరో
ABN, First Publish Date - 2023-07-10T21:32:12+05:30
ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్. తాజాగా హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో కలిసి ‘బేబీ’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నాడీ యంగ్ హీరో. ‘బేబీ’ మూవీ ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు రానుంది.
‘అనగనగా ఓ ప్రేమ కథ’ చిత్రంతో అరంగేట్రం చేశాడు యంగ్ హీరో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin). తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించిన విరాజ్‌కు.. ‘థ్యాంక్యూ బ్రదర్’తో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు వచ్చింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే విరాజ్ తన షార్ట్ ఫిల్మ్ ‘మనసనమహ:’తో ఓ సెన్సేషన్‌ని క్రియేట్ చేశాడు. ఈ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్ (513 అవార్డులు)గా గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడే విరాజ్ అశ్విన్. తాజాగా హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో కలిసి ‘బేబీ’ (Baby Movie) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నాడీ యంగ్ హీరో.
సాయి రాజేష్ (Sai Rajesh) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ మూవీ ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్‌లో లవర్ బాయ్ తరహా పాత్రలో విరాజ్ అశ్విన్ మెప్పించాడు. ట్రైలర్ లాంచ్‌లో ‘చాక్లెట్ బాయ్ లుక్స్’ అని విరాజ్ అశ్విన్‌ను చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) ప్రశంసించినట్లే.. ట్రైలర్‌తో ఆయన స్క్రీన్ ప్రజెన్స్, పాటలలో ఆయన కనిపించిన తీరు.. అందరినీ ఆకర్షిస్తోంది.
‘బేబీ’ ట్రైలర్‌ను చూస్తుంటే.. విరాజ్ అశ్విన్ పాత్ర చాలా కీలకమైనదిగా అర్థమవుతోంది. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తే మాత్రం ఈ కుర్రహీరో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్‌గా విరాజ్ అశ్విన్ నటించిన ‘మాయపేటిక’ విడులైన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోతోన్న ‘బేబీ’ కాకుండా మరో మూడు ప్రాజెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లుగానూ.. విభిన్నమైన పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లుగా విరాజ్ అశ్విన్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. (Young Hero Viraj Ashwin)
ఇవి కూడా చదవండి:
**************************************
*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..
**************************************
*Janhvi Kapoor: జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?
**************************************
*Deen Raj: ఎన్నో కష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం
**************************************
*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..
**************************************
*Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?
**************************************