Mahesh Babu: మహేష్, రజనీకాంత్ సినిమాల ప్లాప్ ల గురించి మురుగుదాస్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-04-05T11:36:15+05:30
దర్శకుడు మురుగుదాస్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మహేష్ బాబు 'స్పైడర్' సినిమా అలాగే రజనీకాంత్ 'దర్బార్' సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయో అయన మాటల్లోనే....
దర్శకుడు మురుగుదాస్ (AR Murugudoss) ఒకప్పుడు స్టార్ దర్శకుడు. కానీ ఇప్పుడు కొంచెం వెనకపడ్డాడు. దానికి కారణం అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పలవటమే. సూర్య తో 'గజినీ' (Gajini) సినిమా తీసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ముగురుదాస్ ఆ తరువాత ఎన్నో విజయాల్ని చవిచూశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అతను నిర్మాతగా '1947 ఆగస్టు 16' (1947 August 16) అనే సినిమా ఈ వారం విడుదల అవుతోంది. ఇది స్వంతత్రం వచ్చిన తరువాత రోజు ఏమి జరిగిందో అన్న నేపథ్యంలో సాగే సినిమా.
అయితే మురుగుదాస్ తీసిన రెండు సినిమాలు ఒకటి మహేష్ బాబు (Mahesh Babu) తో 'స్పైడర్' (Spider), రెండోది రజనీకాంత్ (Rajinikanth) తో 'దర్బార్'(Darbar). ఈ రెండూ ఘోరంగా విఫలం అయ్యాయి. 'స్పైడర్' ప్లాప్ అవ్వడానికి కారణం మహేష్ బాబు కన్నా ఎస్.జె. సూర్య (SJ Suryah) కి ఎక్కువ నిడివి వున్న పాత్ర ఇవ్వటమే అని అన్నాడు మురుగుదాస్ (Murugudoss). తన సినిమా ప్రచారంలో భాగంగా మురుగుదాస్ ఈ రెండు పాత సినిమాల ప్లాప్ ల గురించి కూడా మాట్లాడేడు.
తమిళంలో మహేష్ ని స్టార్ నటుడిగా కాకుండా మామూలుగా చూపించాలని, అక్కడ ఎస్.జె. సూర్య కి బాగా పాపులారిటీ ఉండటంతో అతనికి పెద్ద పాత్ర ఇవ్వటం జరిగింది. అది మురుగుదాస్ కి సూర్య మంచి స్నేహితుడు కాబట్టి ఇచ్చాడు అని అందరూ అప్పుడు విమర్శించారని చెప్పాడు మురుగుదాస్. అలాగే తెలుగులో మహేష్ బాబు పాత్ర తగ్గించటం వలన అభిమానులు బాగా నిరాశ పడ్డారని కూడా చెప్పాడు. అప్పట్లో పాన్ ఇండియా సినిమా అనే విషయం లేదు కాబట్టి ఈ సినిమా లెక్కలు కూడా తప్పాయి అని చెప్పాడు మురుగుదాస్.
అలాగే 'దర్బార్' (Darbar) సినిమా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటూ తొందరగా తీసేయాల్సి వచ్చిందని, అందుకు సినిమా చుట్టేయాల్సి వచ్చిందని చెప్పాడు మురుగుదాస్. సినిమా షూటింగ్ మొదలెట్టకుండానే విడుదల తేదీ ప్రకటిస్తే ఆ సినిమా సగం ప్లాప్ అయినట్టే అని చెప్పాడు మురుగుదాస్. సినిమా అనేది ప్లానింగ్ తో ఉండాలి అని 80 శాతం పూర్తయ్యాక, రషెస్ చూసి, అప్పుడు విడుదల తేదీ ప్రకటించాలని అమీర్ ఖాన్ (Ameer Khan) తనకి చెప్పాడని మురుగుదాస్ చెప్పాడు.