Mrunal thakur: నా వైపు ఓకే కాదుగా..
ABN, First Publish Date - 2023-02-28T18:38:37+05:30
‘సీతా రామం’(Sita Ramam) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై సీత పాత్రతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు మృణాల్ ఠాకూర్(mrunal thakur). తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు.
‘సీతా రామం’(Sita Ramam) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై సీత పాత్రతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు మృణాల్ ఠాకూర్(mrunal thakur). తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి ఓ వింత సరదా సంఘటన ఎదురైంది. ఆమెను ఎంతగానో అభిమానించే ఓ అభిమాని మృణాల్ కామెంట్స్ బాక్స్‌లో ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు(Fan proposal). ‘‘మృణాల్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఓకే. మరి మీ సంగతి ఏంటి’’ అని కామెంట్ చేశాడు. దీనికి మృణాల్ క్యూట్‌గా కూల్‌గా సమాధానమిచ్చింది. ‘నా వైపు నుంచి ఓకే కాదుగా..’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేసింది. నెట్టింట వీళ్లిద్దరి సంభాషణ ఆకట్టుకుంటుంది.
మృణాల్ కథల ఎంపికలో చాలా జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘నాని 30’(nani 30) లో కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రంతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. తాజాగా బాలీవుడ్లో ఆమె నటించిన ‘సెల్ఫీ’ (selfie) చిత్రం విడుదలైంది.