Mrunal Thakur: ఇప్పుడు దక్షిణాదే టార్గెట్!
ABN, First Publish Date - 2023-03-10T19:04:50+05:30
‘సీతారామం’*seetaramam) చిత్రంలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారామె.
‘సీతారామం’*seetaramam) చిత్రంలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారామె. ప్రస్తుతం తెలుగు మేకర్స్ ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే హిందీలో కథానాయికగా నిరూపించుకున్నారు మృణాల్. ప్రస్తుతం అక్కడ ఆరు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. ఇప్పుడు తన టార్గెట్ తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషలు కూడా. దక్షిణాదిలో స్థిరపడాలనే బలమైన కోరికతో ఉన్నారట మృణాల్. తెలుగులో అవకాశాలు బాగానే ఉన్నాయి. నాని 30లో కథానాయికగా నటిస్తోంది. ఇటీవల షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీ టార్గెట్‌గా పెట్టుకున్న మృణల్ హైదరాబాద్‌లో ఓ ఇల్లు తీసుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సౌత్‌లో ఎక్కువ దృష్టి సారించేందుకు ఇటీవల బెంచ్‌మార్క్ టాలెంట్స్ ఏజెన్సీతో జతకట్టింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా తెలిపారు. (Mrunal Thakur Intrest on South cinema)
ప్రస్తుతం కాస్త విరామం తీసుకున్న ఆమె తమిళ, మలయాళ కథలు వినే పనిలో ఉంది. త్వరలోనే తన తమిళ, మలయాల సినిమాలను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. సూర్య హీరోగా నటిస్తున్న 42వ చిత్రంలో మృణాల్ కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే మృణాల్ తమిళంలో లాంచ్ అయ్యేది సూర్యతోనే అనొచ్చు.