Mrunal thakur : సీతకి ఏడాది పూర్తయింది.. తన మనసులో మాట ఏంటంటే!
ABN, First Publish Date - 2023-08-05T19:31:31+05:30
ఏడాది క్రితం మృణాల్ ఠాకూర్ పేరు చెబితే ‘సూపర్30’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘జెర్సీ’ లాంటి హిందీ చిత్రాలు గుర్తొచ్చేవి. మరి ఇప్పుడు తెలుగింటి సీత అనేంతగా గుర్తింపు పొందింది. అందుకు కారణం తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘సీతారామం’. అందులో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటోంది.
ఏడాది క్రితం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు చెబితే ‘సూపర్30’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘జెర్సీ’ లాంటి హిందీ చిత్రాలు గుర్తొచ్చేవి. మరి ఇప్పుడు తెలుగింటి సీత అనేంతగా గుర్తింపు పొందింది. అందుకు కారణం తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘సీతారామం’(SitaRamam) . అందులో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటోంది. మృణాల్ ఠాకూర్ - దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రధారులుగా హను రాఘవపూడి (Hanu raghvapudi) తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం విడుదలై శనివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తనను తెలుగింటి అమ్మాయిగా అంగీకరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ పోస్ట్ చేశారు. ‘‘డియర్ ఆడియన్స్.. నటిగా నా తొలి సినిమా ‘సీతారామం’. నేను కన్న కలలను మించి మీరంతా నాపై ప్రేమాభిమానాలు చూపించారు. నన్ను మీ తెలుగింటి అమ్మాచిగా అంగీకరించి ఆదరించారు. ఈ జర్నీలో మాటల్లో చెప్పలేనంత ప్రేమ చూపించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇది నాకెంతో ప్రత్యేకం. మరెన్నో ఏళ్ల పాటు విభిన్నమైన పాత్రలతో ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటానని మాటిస్తున్నా’’ అని పేర్కొన్నారు. (Sita ramam Completes One year)
అలాగే చిత్ర బృందాన్ని ఉద్దేశించి కూడా ఆమె పోస్ట్ చేశారు. ‘‘నా నుంచి సీత బెస్ట్ వెర్షన్‌ను స్ర్కీన్‌పైకి తీసుకొచ్చిన దర్శకుడు హను రాఘవపూడికి.. ఈ జర్నీని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్‌తోపాటు చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. దీనితోపాటు ‘సీతారామం’ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మృణాల్ ప్రస్తుతం.. నానితో ‘హాయ్ నాన్న’తోపాటు విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.