Theatre and OTT: థియేటర్లన్నింటిలో శ్రీరామనామ స్మరణే!
ABN, First Publish Date - 2023-06-12T12:21:10+05:30
ఈ వారం తెలుగునాట థియేటర్లలో సందడి చేసేది ‘ప్రభాస్’ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఒకటే.. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన భారీ చిత్రం కావడంతో చిన్న సినిమాలు విడుదలకు వారం గ్యాప్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ‘ఆదిపురుష్’దే హవా.
ఈ వారం తెలుగునాట థియేటర్లలో సందడి చేసేది ‘ప్రభాస్’ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ఒకటే.. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన భారీ చిత్రం కావడంతో చిన్న సినిమాలు విడుదలకు వారం గ్యాప్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ‘ఆదిపురుష్’దే హవా. థియేటర్లు మొత్తం శ్రీరామనామ స్మరణతో మార్మోగనున్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణాన్ని నేటి తరానికి పరిచయం చేేసలా సరికొత్త సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కృతీసనన్ జానకిగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ లంకాదిపతిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రెలర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ‘జై శ్రీరామ్’ (Jai sriram) పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
ఒక రోజు ముందు 'ది ఫ్లాష్’ (The Flash)
సూపర్‌హీరో సినిమాలకు హాలీవుడ్ కేరాఫ్ అడ్రస్. ఈ వారం మరో సూపర్ హీరో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. మిల్లర్ కీలక పాత్రలో ఆండీ మూషియాటీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది ఫ్లాష్’ చిత్రం ఇంగ్లిష్‌తో భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ కన్నా ఒకరోజు ముందు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ వారం ఓటీటీలో స్ర్టీమింగ్ అయ్యే చిత్రాలు- వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
ఎక్స్‌ట్రాక్షన్ 2 (హాలీవుడ్) జూన్ 16
మనోరమా మ్యాక్స్
జూన్ 16: వామనన్ (మలయాళం)
అమెజాన్ ప్రైమ్ (jee karda)
జూన్ 15: జీ కర్దా (హిందీ)
జూన్ 16: రావణకొట్టం (తమిళం)
జియో
జూన్ 15: రఫూ చక్కర్ (హిందీ సిరీస్)
జూన్ 16: ఐ లవ్ యూ (హిందీ చిత్రం)
సోనీలివ్
జూన్ 16: ఫర్హానా (తమిళ చిత్రం)
లయన్స్ గేట్‌ప్లే
డెస్పరేట్ రైడర్స్ (హాలీవుడ్)
డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్
జూన్ 14: ఫుల్ కౌంట్ (కొరియన్ సిరీస్)
జూన్ 16: షెవలియర్ (హాలీవుడ్)
జూన్ 15: సైతాన్ (తెలుగు సిరీస్) (Saithan)
జూన్ 17: బిచ్చగాడు2 (తమిళం)