M.M.Keeravani: ఆ ఘనత నాది కాదు!
ABN, First Publish Date - 2023-01-26T14:08:39+05:30
సంగీత దర్శకుడు కీరవాణి గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి అవార్డులు రావడం.. వాటిని గవర్నర్ చేతులు మీదగా తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.
సంగీత దర్శకుడు కీరవాణి (Mm keeravani) గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)చిత్రానికి అవార్డులు రావడం.. వాటిని గవర్నర్ చేతులు మీదగా తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అన్నీ ఆనందించ దగ్గ విషయాలే. పెద్దల ఆశీర్వాదాలతోనే ఇంతటి ఘనత సాధించాం. ఈ ఘనత కేవలం నా కష్టం మాత్రమే కాదు. నాతో పని చేసిన ప్రతి ఒక్కరి విజయం’’ అని అన్నారు. (Padma shri awards)
పద్మశ్రీ పురస్కారం వరించడం పట్ల ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత ప్రభుత్వ పౌర పురస్కారం వరించిన సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు నా గురువులు కవితపు సీతమ్మ గారి నుంచి కుప్పాల బుల్లి స్వామి నాయుడు గారి వరకు అందరికీ హృదయపూర్వక ధన్యవదాలు’’ అని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు కీరవాణి. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆయన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఇదే పాట ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ నామినేషన్ల్‌లోనూ చోటు దక్కించుకుంది. తాజాగా ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.