'Miss Shetty Mr. Polishetty: ట్రైలర్‌తో మిస్ గైడ్ చేశాం!
ABN, First Publish Date - 2023-08-21T23:31:00+05:30
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.
నవీన్ పొలిశెట్టి(Naveen poolishetty) , అనుష్క శెట్టి (Anushka) జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ('Miss Shetty Mr. Polishetty) యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం. సోమవారం ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆడియన్స్ నుంచి సుబ్బు, చరణ్, తులస, శృతి, ఐడిల్ బ్రెయిన్ జీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ ‘‘ఒక కొత్త కాంబినేషన్‌లో నవీన్, అనుష్క, యూవీ క్రియేషన్స్, నేను కలిసి సినిమా చేశామంటే అందుకు ఇన్ స్పైర్ చేసింది కథే. రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో కొంతే ఎంటర్‌టైన్ చేయగలిగాం. థియేటర్‌లోఒ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. కథ ఓకే అయ్యాక అనుష్క గారికి ఇలాంటి సబ్జెక్ట్, క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది అనిపించింది. అదే టైమ్ లో తను కూడా ఇలాంటి ఒక వెరైటీ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సో నేను కథ చెప్పగానే ఆమెకు బాగా నచ్చింది. నవీన్ హీరో అని చెప్పినప్పుడు అనుష్క గారు రైట్ చాయిస్ అని చెప్పారు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉండటం వల్లే మూవీ ఇంత మ్యాజికల్‌గా వచ్చింది. ఇదొక ఎంటర్ టైనింగ్ మూవీ మాత్రమే కాదు. ఒక ఎమోషన్ ఉంటుంది. ఇవాళ్టి యూత్.. రిలేషన్స్‌ను చూస్తున్న దృష్టి కోణం ఉంటుంది. పెళ్లి ఒక్కటే కాదు వాళ్లు ఏర్పర్చుకునే ప్రతి రిలేషన్‌లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం. ట్రెలర్‌లో మీరు చూసిన పాయింట్‌తోనే సినిమా ఉండదు. మిమ్మల్ని ట్రైలర్‌తో మిస్ గైడ్ చేస్తున్నాం. సినిమాలో మరో యూనిక్ పాయింట్ ఉంటుంది. అదేంటో సినిమాలో చూడాలి. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వెరీ క్లీన్ ఫిల్మ్’ అని అన్నారు.
హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ‘‘హ్యూమన్ రిలేషన్స్ మీద మంచి ఎంటర్ టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. జాతి రత్నాలు హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడికి గురయ్యాను. ఫైర్ యాక్సిడెంట్‌లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా జాతి రత్నాలు సినిమా రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే ఓ నటుడిగా నాకేం కావాలి. ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ వచ్చినా, ఎన్ని రికార్డులు సాధించినా ఇంత కంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అలా ఆ సినిమాతో మీరు నాపై చూపించిన అభిమానం ఎంతో కదిలించింది. మిమ్మల్ని ఎలా ఎంటర్ టైన్ చేయాలి. ఇంకా ఎలాంటి కొత్త సబ్జెక్ట్ తీసుకోవాలి అని ఆలోచించాను. మహేశ్ చెప్పిన ఈ స్టోరి చాలా ఎగ్జైట్ చేసింది. స్టాండప్ కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. నిజంగానే స్టాండప్ కామెడీ షోస్ కండెక్ట్ చేసి రియల్ ఆడియెన్స్‌తో మా సినిమాలో సీన్స్ షూట్ చేశాం. నేను కూడా మరే సినిమా ఒప్పుకోకుండా పూర్తిగా ఈ మూవీ మీదే దృష్టి పెట్టా. రొమాంటిక్ కామెడీ మూవీస్‌తో పోల్చితే మా సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ఆమెతో నా కాంబినేషన్ బాగుంది. మా మధ్య టైమింగ్ కుదిరేందుకు ఒకట్రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాం. ట్రైలర్ చూపించింది కొంతే. సినిమాలో అనుష్క చేేస రచ్చను చూస్తారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కెమిస్ర్టీ మీద రన్ అయ్యే సినిమా ఇది. గత రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీదే మేమంతా పనిచేశాం. యాక్షన్ మూవీస్ చేేసందుకు కూడా నేను సిద్థమే. ప్రభాస్‌గారికి ట్రైలర్ బాగా నచ్చింది’’ అన్నారు.