సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mirchi: ఈ సినిమా ఎంతమందినో నిలబెట్టింది

ABN, First Publish Date - 2023-02-08T17:44:52+05:30

సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 8న (February 8) పది సంవత్సరాల కిందట 'మిర్చి' (Mirchi) అనే సినిమా విడుదల అయింది. ఇందులో ప్రభాస్ (Prabhas), అనుష్క శెట్టి (Anushka Shetty) జంట కాగా, దర్శకుడు కొరటాల శివ (Director Koratala Siva) కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ (Pramod), మరియు స్నేహితుడు వంశీ 'యూవీ క్రియేషన్స్' (UV Creations) అనే ఒక సంస్థను మొదలు పెట్టి మొదటి సారిగా ఈ 'మిర్చి' తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 8న (February 8) పది సంవత్సరాల కిందట 'మిర్చి' (Mirchi) అనే సినిమా విడుదల అయింది. ఇందులో ప్రభాస్ (Prabhas), అనుష్క శెట్టి (Anushka Shetty) జంట కాగా, దర్శకుడు కొరటాల శివ (Director Koratala Siva) కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ (Pramod), మరియు స్నేహితుడు వంశీ 'యూవీ క్రియేషన్స్' (UV Creations) అనే ఒక సంస్థను మొదలు పెట్టి మొదటి సారిగా ఈ 'మిర్చి' తీశారు. అలాగే ఈ సినిమా విడుదల అయ్యాక ఇది ప్రభాస్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంత పెద్ద విజయం అంటే, ప్రభాస్ కి అప్పటికి చాలా సంవత్సరాల నుండి మంచి విజయం లభించలేదు, అటువంటి సమయం లో ఈ 'మిర్చి' చాలా పెద్ద ఘనవిజయం సాధించింది. అప్పటికే రాజమౌళి (SS Rajamouli), ప్రభాస్ తో 'బాహుబలి' (Bahubali) ప్రకటించేశాడు, ఆ సమయం లో 'మిర్చి' విజయం 'బాహుబలి' సినిమాకి కూడా ఎంతో ఉపయోగపడింది.

ఇంక దర్శకుడు కొరటాల శివ చాలామంది దగ్గర అసిస్టెంట్ గా, రైటర్ గా పని చేసి మొదటి సారి ఈ 'మిర్చి' తో హిట్ కొట్టాడు. కొరటాల ఈ సినిమాతో ఒక సామజిక సమస్యకి వాణిజ్య హంగులు పూసి ఎలా ఒక అద్భుతమయిన హిట్ సినిమా తీయొచో చెప్పి చూపాడు. ఈ మిర్చి లో అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది, అలాగే వాణిజ్యపరమయిన అంశాలు కూడా చాలా ఉంటాయి. అప్పటి నుండి కొరటాల శివ అగ్ర దర్శకుల్లో ఒకడుగా వున్నాడు అంటే ఈ 'మిర్చి' విజయమే కీలకం. ఈ సినిమాలో సత్యరాజ్ (Satyaraj) పోషించిన పాత్ర వలన అతనికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ముందుగా ఈ పాత్రకి ప్రకాష్ రాజ్ (Prakash Raj) ని అనుకున్నారు, కానీ అతను బిజీ గా ఉండటం తో సత్యరాజ్ ని తీసుకున్నారు. అలా ఈ సినిమా సత్యరాజ్ కి తెలుగులో అవకాశాలు రావటానికి నాంది పలికింది. అలాగే నదియా (Nadiya) కూడా, ఆమెకి ఈ సినిమా రెండో ఇన్నింగ్స్ లాంటిది. ఆమె ఈ సినిమాతో తెలుగులో చాలా సినిమాలు చేసింది, ఇప్పటికీ చేస్తోంది కూడా.

ఇందులో పాటలు అన్నీ చాల పెద్ద హిట్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sree Prasad) దీనికి సంగీతం అందించాడు. ఇందులో స్పెషల్ సాంగ్ అయిన 'పండగల దిగివచ్చావు' ఇప్పటికీ ఈ పాటని మీమ్స్ కి వాడుతూ వుంటారు. మిగతా పాటలు కూడా పెద్ద హిట్. ఈ సినిమా ఇంతమందికి స్పెషల్ గా వుంది అంటే, కొరటాల తీసిన, చూపించిన విధానం ఆలా వుంది. అందుకే ఇది చాలామందిని నిలబెట్టింది. ఈరోజుకి కూడా మిర్చి చూస్తే ఎవరికీ బోర్ అనిపించకుండా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అని అంటూ వుంటారు. అనుష్క శెట్టి ఇందులో కథానాయిక, ఇది ప్రభాస్ తో అనుష్క కి రెండో సినిమా. అంతకు ముందు ఇద్దరూ 'బిల్లా' చేసారు. రిచా గంగోపాధ్యాయ్ అనే అమ్మాయి ఇంకో కథానాయికగా వేసింది. ఫిబ్రవరి 8, 2013 తేదీ పైన చెప్పిన చాలామందికి బాగా గుర్తిండిపోయే రోజు.

Updated Date - 2023-02-08T17:44:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!