కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HanumanTrailer: విజువ‌ల్ వండ‌ర్‌.. మైండ్‌బ్లోయింగ్‌గా హ‌నుమాన్ ట్రైల‌ర్

ABN, Publish Date - Dec 19 , 2023 | 11:28 AM

జాంబీరెడ్డి సినిమా త‌ర్వాత తేజ స‌జ్జా , ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం హను-మాన్. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఒరిజిన‌ల్, పాన్ వరల్డ్‌ సూప‌ర్ హీరో సినిమాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PCU) నుంచి వస్తోన్న ఈ చిత్రం ట్రైల‌ర్ కాసేప‌టి క్రితం విడుద‌లైంది.

hanu man

జాంబీరెడ్డి సినిమా త‌ర్వాత తేజ స‌జ్జా (Teja Sajja), ప్ర‌శాంత్ వ‌ర్మ (Prasanth Varma) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం హను-మాన్ (Hanu Man). ఫ‌స్ట్ ఇండియ‌న్ ఒరిజిన‌ల్, పాన్ వరల్డ్‌ సూప‌ర్ హీరో సినిమాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PCU) నుంచి వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలవగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి జాతీయ స్థాయిలో సినిమాపై హైప్ వచ్చింది. అదేవిధంగా ఇప్పటివరకు రిలీజ్ చేసిన మూడు పాటలు ఒకదాన్ని మించి మరోటి సక్సెస్ సాధించాయి.

తాజాగా విడుద‌ల చేసిన ట్రైలర్ మైండ్‌బ్లోయిగ్‌గా ఉంది, ఇంత‌వ‌ర‌కు మ‌నం ఏ చిత్రంలో చూడ‌ని విధంగా అద్భుత‌మైన గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్‌తో మెస్మ‌రైజ్ చేశారు. అదేవిధంగా విల‌న్‌ పాత్ర‌ధారిని కూడా హాలీవుడ్ సూప‌ర్ హీరోస్‌ స్థాయిలో మేకోవ‌ర్ చేయించిన విధానం, త‌మ్ముడి కోసం అక్క వ‌ర‌ల‌క్ష్మి అడ్డు నిల‌వ‌డం వంటి కొన్ని ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో సినిమాపై హైప్స్ భారీగా పెరిగేలా చేశారు.

ఇదిలాఉండ‌గా సంక్రాంతికి విడుద‌ల అవుతున్న 6 పెద్ద సినిమాల‌తో పోటీగా వ‌స్తున్న‌ ఈ హ‌నుమాన్ చిత్ర‌మే ఖ‌చ్చితంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌ని ట్రైల‌ర్‌ను చూస్తూంటేనే అర్థ‌మ‌వుతుందంటే అతిశ‌యోక్తి కాదు.

2024 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవలే ప్రారంభించగా ఈ రోజు(డిసెంబర్ 19) ఉదయం 11.గంటల 7 నిమిషాలకు 3 నిమిషాల 28 సెకండ్స్ నిడివితో థియేట్రికల్ ట్రైలర్ (Hanuman Trailer ) ను విడుదల చేశారు. తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ (Amritha Aiyer) కథానాయికగా, వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి (K Niranjan Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు.


అయితే ఇదంతా ఇలా ఉండగా ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా అంటూ గొప్పలు బోతున్న మనకు షాక్ ఇచ్చేలా ఈ చిత్ర మేకర్స్ హను-మాన్ సినిమాను 12 జనవరి, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ సినిమాగా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్తే మన దేశ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకెందుకు ఆల‌స్యం.. మీరూ ఓ లుక్కేసి ఆ ట్రైల‌ర్‌ను ఆస్వాదించండి.

Updated Date - Dec 19 , 2023 | 11:53 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!