KiranAbbavaram: 'మీటర్' మొదటి రోజు కలెక్షన్ అంతేనా? ప్రచార ఖర్చులు అయినా వస్తాయా...
ABN, First Publish Date - 2023-04-08T15:42:59+05:30
కిరణ్ అబ్బవరం నటించిన 'మీటర్' సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే షాకింగ్ గా వుంది. ఈ సినిమాకి ప్రచారం బాగా చేసిన మొదటి రోజు ఎంత రెవిన్యూ వచ్చిందో మీరు చూస్తే కనక....
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమా 'మీటర్' (#Meter) నిన్న శుక్రవారం రవితేజ (Ravi Teja) సినిమా 'రావణాసుర' (#Ravanasura) తో పాటుగా విడుదల అయింది. రావణాసుర కలెక్షన్ మొదటి రోజు బాగుంటే, మీటర్ కలెక్షన్ (MeterCollections) మొదటి రోజు వింటే షాక్ అవుతారు. కిరణ్ అబ్బవరం వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ, కంటెంట్ లేకుండా వెళితే ఎలా ఉంటుందో ఈ 'మీటర్' (MeterCollection) సినిమా కలెక్షన్ మరోసారి రుజువు చేసింది. మొదటి రోజు నైజాం ఏరియా (NizamArea) గ్రాస్ ఎంతో తెలుసా? కేవలం రూ. 25 లక్షలు (25 lakhs) కలెక్టు చేసింది అంటే, ఇంకా అందులో షేర్ ఎంతొస్తుంది. దీన్ని బట్టి మిగతా ఏరియా కలెక్షను మీరే ఊహించుకోండి.
ఇలా ఒక్క నైజాం ఏరియా లో మొదటి రోజు కలెక్షన్ ఇంత తక్కువ వస్తే, ఈ సినిమా నిలబడుతుందా. ఈ సినిమా మామూలుగానే నెగటివ్ టాక్ తో విడుదల అయింది. ఇంకా ఆసక్తికరం ఏంటి అంటే ఈ సినిమా వెనక పెద్ద సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వుంది. అందులో భాగస్వామ్యం అయిన చెర్రీ (చిరంజీవి) ఈ సినిమా నిర్మాత. మరి అంత పెద్ద సంస్థ వెనక వున్నా సినిమా ఎందుకు ఆడలేదు. అంటే సినిమాలో దమ్ములేదు. ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా, సినిమా కథని నమ్మాలి, అంతే కానీ కాంబినేషన్ ని కాదు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.
మరి 'మీటర్' థియేట్రికల్ (MasterTheatricalRights) హక్కులు ఇంతకీ అమ్మారో తెలుసా? అది రూ.3.5 కోట్లకు పైగా, మరి ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే ఎక్కడా కూడా షేర్ ఏమి రాలేదు. మరి ప్రచారానికి పెట్టె ఖర్చు కూడా రాదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా విడుదలకి ముందే ఓ.టి.టి. హక్కులు (OTT Rights) ఇచ్చేసారు కాబట్టి కొంత సేఫ్ అని అంటున్నారు. ఏమైనా కూడా ఒక పెద్ద సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ నుండి ఇలాంటి ప్లాప్ సినిమా రావటం ఏంటి అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
ఇది కూడా చదవండి:
NaniVsNikhil: నిఖిల్ ని దాటలేకపోయిన నాని
PushpaTheRule: 'పుష్ప 2' నుంచి ఓ లుక్ వదిలారు, ఫాన్స్ చూశారంటే చొక్కాలు చించేసుకుంటారు !