సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bholaa Shankar: కొత్త సంవత్సరం.. మెగా ఫ్యాన్స్‌కి చిరు ఇచ్చిన ట్రీట్ ఇదే

ABN, First Publish Date - 2023-03-21T20:25:04+05:30

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్‌ (Meher Ramesh) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భోళా శంకర్’ (Bholaa Shankar). ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను

Bholaa Shankar New Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్‌ (Meher Ramesh) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భోళా శంకర్’ (Bholaa Shankar). ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్రియేటివ్ కమర్షియల్స్‌తో (Creative Commercials) కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా.. తెలుగు నూతన సంవత్సరాన్ని (Ugadi) పురస్కరించుకుని ‘భోళా శంకర్’ మేకర్స్ మెగా అప్డేట్ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్.. ఈ సినిమాని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ అప్‌డేట్ ఏమిటంటే.. (Bholaa Shankar Release Date)

‘భోళా శంకర్’ చిత్రాన్ని 11 ఆగస్ట్, 2023న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా తెలుగుదనం ఉట్టిపడేలా.. ఆసక్తికరంగా ఉంది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ కుర్తా, షేడ్స్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించగా.. రాయల్ చైర్‌లో ఒకవైపు కీర్తి సురేష్ (Keerthy Suresh), మరో వైపు తమన్నాలు (Tamannaah) ట్రెడిషనల్ వేర్‌లో దర్జాగా కూర్చుని పండగ కళను తీసుకొచ్చారు. వారిద్దరూ అలా కూర్చుని ఉంటే.. మధ్యలో చిరంజీవి హుందాగా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి బ్రహ్మాండమైన హిట్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఇప్పటికే విడుదలైన ‘భోళా శంకర్’ ప్రమోషనల్ కంటెంట్ కూడా అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్.. చిరంజీవి సిస్టర్‌గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ (Sushanth) ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లుగా రీసెంట్‌గానే మేకర్స్ తెలిపారు. సత్యానంద్ కథా పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రానికి తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-21T20:25:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!