సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Charan: ‘గర్వంగా ఉంది నాన్న’.. బుగ్గపై ముద్దుతో చిరు విషెస్..

ABN, First Publish Date - 2023-03-27T12:12:36+05:30

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే.. ఆయన కుమారుడు రామ్‌చరణ్ (RamCharan) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Chiranjeevi to Ram Charan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే.. ఆయన కుమారుడు రామ్‌చరణ్ (RamCharan) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దాంతో.. చిరు పుత్రోత్సాహంలో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ (Oscars) రావడతో చెర్రీ గ్లోబర్ స్టార్‌గా మారిపోయారు. సోమవారం(మార్చి 27న) రామ్‌ చరణ్‌ బర్త్‌డే (Birthday). ఈ సందర్భంగా చాలా తక్కువ సమయంలో హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన కుమారుడికి చిరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. ఇతర సినీ ప్రముఖులు కూడా చెర్రీకి పుట్టిన రోజుల విషెస్ తెలుపుతున్నారు.

చిరు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌లో.. కుమారుడి బుగ్గ మీద మెగాస్టార్ ముద్దు పెడుతున్న ఫొటోని షేర్ చేశారు. దానికి.. ‘గర్వంగా ఉంది నాన్న. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.


అలాగే.. ‘మెగా పవర్ స్టార్ కాదు. మెగా గ్లోబల్ స్టార్, ప్రతి తెలుగువాడికి గర్వకారణం! మీరు గ్లోబల్ స్టేజ్‌ని స్వాధీనం చేసుకోవడం చూడటానికి ఎదురు చూస్తున్నాం. ఇలాగే వేగంగా దూసుకు వెళ్లండి’ అని పీవీపీ నిర్మాణ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపింది.


‘మా గ్లోబల్ స్టార్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాగే కొనసాగుతూ.. ప్రపంచానికి తెలిసేలా మరిన్నీ విజయాలు సాధించండి’ అని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ రాసుకొచ్చింది.


‘మెగాస్టార్ రామ్‌చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు! మీకు వచ్చే సంవత్సరం మరింత ఆనందం, విజయం, ప్రేమ సమృద్ధిగా లభించాలని ఆశిస్తున్నాం’ అని ఫిల్మ్‌ఫేర్ యాజమాన్యం రాసుకొచ్చింది.

Updated Date - 2023-03-27T12:30:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!